శ్రద్దా వాకర్ మర్డర్ కేసు: 22న అఫ్తాబ్ బెయిల్ పిటిషన్ విచారించనున్న ఢిల్లీ కోర్టు

By Mahesh KFirst Published Dec 17, 2022, 3:09 PM IST
Highlights

శ్రద్ధా వాకర్ హత్య కేసులో బెయిల్ కోసం అఫ్తాబ్ పూనావాలా పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెల 19న ఆయన తన న్యాయవాది అవినాశ్‌ను కలువనున్నారు. 22వ తేదీన ఢిల్లీ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ విచారించనుంది.
 

న్యూఢిల్లీ: శ్రద్దా వాకర్ కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 22వ తేదీన ఢిల్లీ కోర్టు విచారించనుంది. ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరయ్యారు. అఫ్తాబ్ పూనావాలాకు అడ్వకేట్ అవినాశ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ న్యాయవాది అవినాశ్‌ను కలవడానికి తనను అనుమతించాలని తాజాగా, కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది. ఈ నెల 19వ తేదీన ఆయన తన అడ్వకేట్ అవినాశ్‌ను కలువనున్నారు. 

ఢిల్లీలోని సాకేట్ కోర్టును ఆయన శుక్రవారం ఆశ్రయించారు. బెయిల్ కోసం ఆయన కోరారు. ప్రస్తుతం అఫ్తాబ్ పూనావాలా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ ఈ నెల 23వ తేదీన ముగియనుంది. ఢిల్లీలోని తిహార్ జైలులోనే ఉన్నాడు.

అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్ 2019లో ఓ డేటింగ్ యాప్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత వారు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారి పట్టణం వసాయ్, ముంబయిలో కలిసి జీవించిన తర్వాత ఇద్దరు కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. అక్కడ ఇంటి ఖర్చులు, ఎఫైర్‌ల అనుమానాలు, ఇతర అనేక విషయాల్లో గొడవ పడ్డారు. ఫలితంగా వారి అనుబంధం పలుచబడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read: శ్రద్ధా హత్య కేసులో మరో కీలక పరిణామం.. ఆ ఎముకలు శ్రద్దావే.. డీఎన్ఏ రిపోర్టులో స్పష్టత..

దక్షిణ ఢిల్లీలోని మెహరౌలీలో వారు అద్దెకు ఉన్న ఇంటిలోనే శ్రద్ధా వాకర్‌ను గొంతు నులిమి అఫ్తాబ్ పూనావాలా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని 35 ముక్కలుగా నరికాడు. తన ఇంటిలోనే 300 లీటర్ల ఫ్రిడ్జీలో సుమారు మూడు వారాలపాటు నిల్వ చేశాడు. ఈ కాలంలో పట్టణ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఆ శరీర భాగాలను అర్ధరాత్రి పూట బ్యాగ్‌లో వేసుకుని పడేసి వచ్చాడు. మే నెలలోనే శ్రద్ధా వాకర్‌ను హత్య చేశాడు.

మెహరౌలీ అడవిలో పోలీసులు రికవరీ చేసుకున్న కొన్ని ఎముకలతో శ్రద్ధా వాకర్ తండ్రి డీఎన్‌ఏ మ్యాచ్ అయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఈ మేరకు ధ్రువీకరించింది. దీంతో ఆ శరీర భాగాలు శ్రద్ధా వాకర్‌వే అని రూఢీ అయింది. 

అఫ్తాబ్ పూనావాలాకు నిర్వహించిన పాలిగ్రాఫ్, నార్కో టెస్టులకు సంబంధించిన నివేదికలను ఢిల్లీ పోలీసులు స్వీకరించారు. శ్రద్ధా వాకర్ శరీర భాగాలు వెతుకుతుండగా 13 ఎముకల భాగాలను వారు రికవరీ చేసుకున్నారు. శ్రద్ధా వాకర్ హత్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

click me!