బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు.
సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగనప్పుడు.. బాధితులు ఎక్కడికి వెళ్లాలని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) చీఫ్ స్వాతి మలివాల్ ప్రశ్నించారు. బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత స్వాతి మలివాల్ ఈ వ్యాఖ్యలు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది. అలాగే.. ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులు హత్య కాబడ్డారు.
ఆ ఘటనలోని 11 మంది నిందితులను హైకోర్టు ఆదేశాల ప్రకారం.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరిణామాన్ని బాధితురాలు తీవ్రంగా వ్యతిరేకించింది. గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయడానికి సంబంధించి తన తీర్పును పున:సమీక్ష చేయాలని ఆమె సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే.. ఈ విజ్ఞప్తిని నేడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ పరిణామాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) చీఫ్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ఇలా రాసింది. "బిల్కిస్ బానో అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బిల్కిస్ బానోకు 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సామూహిక అత్యాచారం జరిగింది, ఆమె మూడేళ్ల కొడుకుతో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులు హత్య చేయబడ్డారు. అయితే.. గుజరాత్ ప్రభుత్వం రేపిస్టులందరినీ విడిపించింది.సుప్రీంకోర్టులో న్యాయం జరగకపోతే.. ప్రజలు ఎక్కడికి వెళతారు? అని శ్రీమతి మలివాల్ ట్వీట్ చేస్తూ.. ప్రశ్నించారు.
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, హత్య
2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె కుటుంబంలోని ఏడుగురిని చంపబడ్డారు. అయితే.. ఈ కేసులో శిక్షపడ్డ 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న సత్ప్రవర్తన కింద విడుదల చేసింది. నిందితుల విడుదలను బాధితురాలు బిల్కిస్ బానో సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది.
11 మంది దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించి 1992లో అమల్లోకి వచ్చిన రిమిషన్ పాలసీ ప్రకారమే తమ దరఖాస్తులు పరిగణించాలని కోరారు. ఆ మేరకు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే.. తమను దోషులుగా నిర్దారించినప్పుడు ఆ రిమిషన్ పాలసీనే అమల్లో ఉన్నదని తెలిపారు. ఆ దోషి పిటిషన్‌తో సుప్రీం ఏకీభవించి గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశాలు చేసింది.
వారి దరఖాస్తులను 1992 రిమిషన్ పాలసీ కింద పరిగణించాలని పేర్కొంది. ఈ తీర్పు వెలువరించిన మూడు నెలల తర్వాత ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులను గోద్రా జైలు నుంచి విడుదల చేసింది. ప్రస్తుతం ఆ తీర్పును రివ్యూ చేయాలని బిల్కిస్ బానో విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు మరో పిటిషన్ కూడా దాఖాలు వేసింది. అయితే.. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం.. మరో పిటిషన్ పై ప్రభావం చూపవేయదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.