బెడ్ బాక్స్ లో ఇరుక్కున్న మహిళ.. మనవరాలి ఫోన్ తో..

By telugu news teamFirst Published Jul 17, 2020, 10:32 AM IST
Highlights

బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా.. ఆమె బయటకు రాలేకపోయింది. కాగా.. స్వోర్ష్ కోహ్లీ.. మనవరాలు నాన్సీ ఈ విషయాన్ని గుర్తించింది. 

ఓ మహిళ ప్రమాదవశాత్తు.. బెడ్ బాక్స్ లో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత.. అందులో నుంచి బయటకు రాలేకపోయింది. వయసు ఎక్కువగా ఉండటంతో.. అందులోనూ బలహీనంగా ఉండటంతో.. ఆమె బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలయ్యాయి. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. ఆమెను రక్షించారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతానికి చెందిన స్వోర్ష్ కోహ్లీ(84) దేవ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివసిస్తోంది. కాగా.. ఆమె ప్రమాదవశాత్తు తన ఇంట్లోని బెడ్ బాక్స్ లో పడిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనార్హం.

బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా.. ఆమె బయటకు రాలేకపోయింది. కాగా.. స్వోర్ష్ కోహ్లీ.. మనవరాలు నాన్సీ ఈ విషయాన్ని గుర్తించింది. తన అమ్మమ్మ ఇంట్లోని పరిస్థితిని సీసీటీవీ కెమేరా సహాయంతో నాన్సీ తరచూ.. తన ఫోన్ లో పర్యవేక్షిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో తన అమ్మమ్మ బెడ్ బాక్స్ లో పడిపోవడాన్ని గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. కాగా.. వారు వెంటనే రంగంలోకి దిగారు. ఇంటికి అమర్చిన ఇనుమ డోర్లను బలవంతంగా పగలకొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు.. బెడ్ బాక్స్ లో ఇరుక్కున్న వృద్ధురాలిని రక్షించగలిగారు. కాగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని పోలీసులు తెలిపారు. వయసు కారణంగా వచ్చిన బలహీనత వల్లే.. ఆమె ఆ డోర్ తీసుకోలేకపోయిందని పోలీసులు చెప్పారు. ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని.. సురక్షితంగా బయటపడిందని చెప్పారు. 

click me!