ఇండియాలో కరోనా విజృంభణ: 10 లక్షలు దాటిన కేసులు, 25 వేలు దాటిన మరణాలు

By narsimha lode  |  First Published Jul 17, 2020, 10:23 AM IST

 దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 687 మంది మరణించారు.  దేశంలో కరోనా  కేసుల సంఖ్య 10,03,832కి చేరుకొంది.



న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 687 మంది మరణించారు.  దేశంలో కరోనా  కేసుల సంఖ్య 10,03,832కి చేరుకొంది.

దేశంలో 3,42,473 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 6,35,757 మంది  కోలుకొన్నట్టుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.కరోనాతో ఇప్పటివరకు 25,602 మంది మరణించారని కేంద్ర హెల్త్ బులెటిన్ తెలిపింది.

Latest Videos

గురువారం నాడు ఒక్క రోజే అస్సాం రాష్ట్రంలో 892 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 20,646కి చేరుకొంది. 

కర్ణాటక రాష్ట్రంలో గురువారం నాడు ఒక్క రోజే 4,169 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 50 వేలకు చేరుకొంది. ఒక్క రోజులోనే 104 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్  1031కి చేరుకొంది.

పంజాబ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో తొమ్మిది మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 230కి చేరుకొంది. రాష్ట్రంలో కొత్తగా 298 కేసులు రికార్డయ్యాయి. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 9,094కి చేరుకొంది.

also read:కరోనా ఉధృతి: నేటి నుండి బీహార్‌లో లాక్‌డౌన్

బీహార్ రాష్ట్రంలో 1,385 కరోనా కేసులు  రికార్డయ్యాయి. అంతేకాదు 10 మంది మరణించారు. రాష్ట్రంలో 21,558 కేసులు రికార్డయ్యాయి. . కరోనాతో 167 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపింది.

గంజాం, కురుద్రా, కటక్, జాజ్‌పూర్ జిల్లాలతో పాటు రూర్కెలా సిటీలో శుక్రవారం నాడు ఉదయం నుండి ఈ నెల 31వ తేదీ వరకు  లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

click me!