కశ్మీర్ లో మళ్లీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Published : Jul 17, 2020, 09:39 AM IST
కశ్మీర్ లో మళ్లీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

సారాంశం

జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల కోసం శుక్రవారం గాలింపు చేపట్టగా దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

జమ్మూకశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ కలకలం రేగింది. జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని నాగనాడ్ చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

కుల్గాం జిల్లాలోని నాగనాడ్ చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల కోసం శుక్రవారం గాలింపు చేపట్టగా దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

ఈ ఎన్ కౌంటరులో ముగ్గురు భారత జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఉగ్రవాదులను గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది జమ్మూకశ్మీర్ లోయలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 131 మంది ఉగ్రవాదులు మరణించారు. కాగా.. ఇంకా కొందరు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు జవాన్లు వారి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం