కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

By narsimha lodeFirst Published May 16, 2021, 12:15 PM IST
Highlights

మరో వారం రోజుల పాటు ఢిల్లీలో  లాక్‌డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. 

న్యూఢిల్లీ:  మరో వారం రోజుల పాటు ఢిల్లీలో  లాక్‌డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.  తాజాగా లాక్‌డౌన్ ను పొడిగించడంతో ఈ నెల 24 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 

also read:కరోనా జోరు: యూపీ, ఢిల్లీలో లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగింపు

వాస్తవానికి ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్  అమల్లో ఉంది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ తర్వాత కరోనా కేసుల  తీవ్రత తగ్గుతుందని ఢిల్లీ సర్కార్ గుర్తించింది. కరోనా పాజిటివీరేటు తగ్గుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఈ కేసుల తీవ్రతను తగ్గించే ఉద్దేశ్యంతోనే లాక్‌డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. 

మరో వైపు  క్రమపద్దతిలో   దుకాణాలు తెరుచుకొనే అవకాశం కల్పించాలని ఢిల్లీసీఎం కేజ్రీవాల్ ను  వర్తక సంఘం ప్రతినిధులు కోరారు. అయితే కరోనాను కంట్రోల్ అయ్యేవరకు  లాక్‌డౌన్ వైపే  కేజ్రీవాల్ సర్కార్ మొగ్గుచూపింది.  ఢిల్లీలో లాక్‌డౌన్ కు ముందు కేసుల తీవ్రత ఎక్కువగా ఉండేదని వైద్య ఆరోగ్యశాఖాధికారులు గుర్తు చేస్తున్నారు. లాక్‌డౌన్ అమలైన తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. 
 

click me!