బ్లాక్‌ఫంగస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, నివారణ ఎలాగంటే?: రణదీప్ గులేరియా

By narsimha lodeFirst Published May 16, 2021, 10:46 AM IST
Highlights

కరోనాతో బాధపడుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులకు స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల  బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్  రణదీప్ గులేరియా చెప్పారు. 

న్యూఢిల్లీ: కరోనాతో బాధపడుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులకు స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల  బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్  రణదీప్ గులేరియా చెప్పారు. బ్లాక్ ఫంగస్ బీజాంశం  గాలి,ఆహారం కూడ కన్పిస్తోందని  ఆయన చెప్పారు. అయితే ఇవి దీంతో పెద్దగా ఇన్‌ఫెక్షన్ కల్గించవన్నారు. కరోనా కంటే ముందు ఈ రకమైన కేసులు తక్కువగా ఉండేవన్నారు. కరోనా తర్వాత ఈ కేసులు ఎక్కువగా నమౌదౌతున్నాయన్నారు.

శనివారం నాడు ఆయన మీడియా సమావేశంలో ఈ విషయమై మాట్లాడారు. బ్లాక్ ఫంగల్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ కేసుల విషయంలో  జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆసుపత్రులను కోరారు.  ఎయిమ్స్ లో బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కేసులు 23 నమోదయ్యాయన్నారు. ఈ 23 మందిలో 20 మంది కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సుమారు 500కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్ ఫంగస్ ముఖం, ముక్కు, కంటి,మెదడుపై ప్రభావం చూపనుంది.

అంతేకాదు ఊపిరితిత్తులకు కూడ నష్టం కల్గించనుందని గులేరియా చెప్పారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కరోనాతో బాధపడేవారిని చికిత్స చేసే సమయంలో  స్టెరాయిడ్లు  బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. ఈ రోగుల్లో తొలి నాళ్లలో సైనస్ నొప్పి, తలనొప్పి ,తిమ్మిరి, పంటి నొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి.ముక్కు మీద నల్లబడడం లేదా రంగు మారడం అస్పష్టంగా లేదా డబుల్ దృష్టి, చాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. మధుమేహాంతో ఉన్న కరోనా రోగులకు ఉపయోగించే డెక్సామెథాసోన్ వంి స్టెరాయిడ్ల వాడకం ద్వారా షుగర్ పెరగనుందని వైద్యులు చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదౌతున్నట్టుగా మీడియా రిపోర్టు చేస్తున్నాయి. దేశంలో షుగర్ రోగులు ఉండడం కూడ దీనికి కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. 


 

click me!