
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం 2,46,84,077కి చేరుకొంది. గత ఒక్క రోజులో కరోనాతో 4,077గా రికార్డైంది. కరోనాతో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 2,70,284కి చేరుకొంది. శనివారం నాడు కరోనాతో 4 వేల మందిలోపుగా మరణించారు. ఆదివారం నాడు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 వేలకు పైగా చోటు చేసుకొన్నాయి.
గత 24 గంటల్లో కరోనా నుండి 3,62,437 మంది కోలుకొన్నారు. కరోనా కేసుల కంటే రికవరీ అవుతున్న రోగుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 2,07,95,335కి చేరుకొంది. దేశంలో ప్రస్తుతం 36,18,458 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు దేశంలో 18,32,950 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు కరోనా పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య 18,22,20,264కి చేరుకొంది. దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీని ప్రభావంతో కరోనా కేసులు తగ్గుతున్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖాికారులు అభిప్రాయపడుతున్నారు.