కూలిన మూడంతస్థుల భవనం..ఐదుగురు మృతి

Published : Sep 26, 2018, 03:18 PM IST
కూలిన మూడంతస్థుల భవనం..ఐదుగురు మృతి

సారాంశం

ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. 

మూడంతస్థుల భవనం కూలి ఐదుగురు మృతి చెందిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్ సవాన్ పార్క్ ప్రాంతంలో మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.


ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. శిథిలాల కిందినుంచి ఎనిమిది మందిని రక్షించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?