ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

By Arun Kumar PFirst Published Sep 26, 2018, 3:08 PM IST
Highlights

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరం లేదని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయిదే ఇందుకోసం గతంలో విధించిన షరతులు మాత్రం అమల్లో ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది. 
 
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగలుకు రిజర్వేషన్ల పరంగా ప్రమోషన్లు ఇవ్వరాదని 2006 లో సుప్రీం తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు కొన్ని షరతులకు లోబడి అమలవుతుందని దర్మాసనం వెల్లడించింది.  నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో సుప్రీం ఈ తీర్పు ఇచ్చింది. 

అయితే ఈ తీర్పును పున:సమీక్షించాలంటూ కొందరు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు... ఈ అంశంపై ఎలాంటి సమీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. 

click me!