రాష్ట్రాల రాజకీయం.. ఢిల్లీలోని బీజేపీ నేతను అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు.. అడ్డుకున్న హర్యానా పోలీసులు

Published : May 06, 2022, 01:12 PM IST
రాష్ట్రాల రాజకీయం.. ఢిల్లీలోని బీజేపీ నేతను అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు.. అడ్డుకున్న హర్యానా పోలీసులు

సారాంశం

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌పై సోషల్ మీడియాలో మండిపడ్డ బీజేపీ నేతను పంజాబ్ పోలీసులు ఈ రోజు ఉదయం వచ్చి అరెస్టు చేశారు. ఆయనను పంజాబ్‌కు తీసుకెళ్లుతుండగా బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.

న్యూఢిల్లీ: హస్తినలో రాష్ట్రాల రాజకీయం చర్చనీయాంశం అవుతున్నది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పంజాబ్‌లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో అరవింద్ కేజ్రీవాల్‌కు కలిసొచ్చింది. ఢిల్లీలో పలుమార్లు అధికారాన్ని చేపట్టినా పోలీసులు తన బాధ్యతల్లో లేని లోటును ఇప్పుడు పంజాబ్ పోలీసులతో తీర్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. కానీ, దాని పక్కనే ఉన్న హర్యానా మాత్రం నీ ఆటలు సాగవ్ అన్నట్టుగా అడ్డుకట్ట వేస్తున్నది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరించిన బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ భగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పంజాబ్‌ రాష్ట్రానికి తీసుకువస్తూ ఉంటే మధ్యలో బీజేపీ అధికారంలోని హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ అంశంపైనే తజీందర్ పాల్ సింగ్ భగ్గా.. అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో నిన్ను బతుకనివ్వం అంటూ బెదిరించారు. ఈ వ్యాఖ్యలపైనే పంజాబ్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తులో హాజరు కావాలని పంజాబ్ పోలీసులు ఐదు సార్లు నోటీసులు పంపారు. కానీ, ఈ నోటీసులకు ఆయన సరిగ్గా స్పందించలేదు. ఈ కారణంగానే ఆయనను అరెస్టు చేస్తున్నట్టు పంజాబ్ పోలీసులు చెప్పారు.

ఢిల్లీ బీజేపీ ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ఈ ఘటనపై వీడియోలో స్పందించాడు. ఢిల్లీలోని భగ్గా నివాసంలోకి ఈ రోజు ఉదయం 8.30 గంటలకు 50 మంది పోలీసులు చొచ్చుకెళ్లారని వివరించాడు. అనంతరం ఆయనను అరెస్టు చేశాడని తెలిపారు. కనీసం నెత్తికి టర్బన్ కూడా చుట్టుకోనివ్వలేదని ఆరోపించారు. ఈ రోజు ఉదయం పది నుంచి 15 మంది ఇంట్లోకి దూసుకొచ్చారని, తన కొడుకు తజీందర్‌ను ఇంటి బయటకు లాక్కెళ్లారని తజీందర్ పాల్ సింగ్ భగ్గా వివరించారు. ఈ ఘటనను రికార్డు చేయడానికి తాను ఫోన్ తీయగానే.. ఒక పోలీసు తనను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి తన ముఖంపై గుద్దు గుద్దాడని అన్నారు.

తన కొడకు భగ్గాను తీసుకెళ్లిన తర్వాత ఢిల్లీ పోలీసులకు భగ్గా తండ్రి ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణతో ఫిర్యాదు చేశారు. కాగా, బీజేపీ నేతలు ఈ ఘటనతో అరవింద్ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !