జమ్మూలో ఐఐటీ, ఐఐఎం ఉండకూడదా?.. ప్రధాని మోదీ (వీడియో)

By SumaBala Bukka  |  First Published Feb 20, 2024, 11:01 AM IST

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మంగళవారం జమ్మూలో 30,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్నారు.
 


జమ్మూ : మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన విద్యాసంస్థల ప్రారంభోత్సవం, శంఖుస్థాపన నేపథ్యంలో డిసెంబర్ 2013లో ప్రధాని లాల్కర్ ర్యాలీలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

ఆ సమయంలో ప్రధాని మాట్లాడుతూ.. జమ్మూలో ఐఐటీ, ఐఐఎం ఉండకూడదా? ఇక్కడి యువత చదువుకుని లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందకూడదా? అని ప్రశ్నించారు. అయితే. జమ్మూ & కాశ్మీర్‌లో విద్యా సంస్థలను అభివృద్ధి చేయడంపై జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వానికి లేదా ఢిల్లీ ప్రభుత్వానికి ఇష్టం లేదని విమర్శించారు. 

పెళ్లి పందిరిలోనే వధువు కాళ్లు తాకిన వరుడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

ప్రధాన విద్యాసంస్థలు ఉన్నత విద్యాసంస్థల కోసం ఆకాంక్షించాలని J&K ప్రజలను కోరడమే కాకుండా, ఇవి వాస్తవం అయ్యేలా కూడా ప్రధాని ఆ సమయంలో హామీ ఇచ్చారు. ప్రధాని హామీలో భాగంగానే మంగళవారం నాడు ఐఐఎం జమ్మూ శాశ్వత క్యాంపస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.

జమ్మూలోని విజయపూర్ (సాంబా) ఎయిమ్స్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. IIT జమ్మూ దేశ అకడమిక్ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలకు కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

దీంట్లో భాగంగానే ఐఐటీ జమ్మూ, ఐఐఎం జమ్మూలతో పాటు ఐఐటీ భిలాయ్, ఐఐటీ తిరుపతి, ఐఐఐటీడీఎం కాంచీపురం, ఐఐఎం బోధ గయా, ఐఐఎం విశాఖపట్నం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్) కాన్పూర్ వంటి అనేక ముఖ్యమైన విద్యా సంస్థలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు.  2019 ఫిబ్రవరిలో జమ్మూలో ఏఐఐఎంఎస్ కి ప్రధాని శంకుస్థాపన చేశారు. 

.వీటితో పాటు జమ్మూ విమానాశ్రయం, జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపో కొత్త టెర్మినల్ భవనానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జమ్మూ, కాశ్మీర్‌లో అనేక ముఖ్యమైన రోడ్డు, రైలు కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ అంతటా పౌర, పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం కూడా ప్రధానమంత్రి చేయనున్నారు

click me!