ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. పిల్లలతో సహా కేజ్రీవాల్ ఇంటికి..

By telugu teamFirst Published Feb 11, 2020, 8:28 AM IST
Highlights

తమ పిల్లలతో సహా వాళ్లంతా కేజ్రీవాల్ ఇంటికి వెళుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ నాయకుడు విజయ్ గోయల్.. కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఇక ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెళువడనున్నాయి.  ఇప్పటికే ఇటీవల జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆప్ ముందంజలో ఉండగా... రెండో స్థానంలో బీజేపీ ఉంది. కాగా... కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. 

ఇదిలా ఉంటే... ఈ రోజు ఉదయం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. తమ పిల్లలతో సహా వాళ్లంతా కేజ్రీవాల్ ఇంటికి వెళుతుండటం విశేషం.  ఆ పిల్లలు కేజ్రీవాల్ ఇంటి వద్ద అందమైన రంగు రంగు రంగవళ్లిక వేస్తుండటం విశేషం. మరోసారి విజయం కేజ్రీవాల్ కే దక్కుతుందనే నమ్మకంతో వారు ఆ ముగ్గులు వేస్తున్నారు. 

also Read డిల్లి ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్: ఆప్ ఆరంభం అదుర్స్...

మరోవైపు బీజేపీ నాయకుడు విజయ్ గోయల్.. కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఇక ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదిలా ఉండగా... కౌంటింగ్‌ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు.. ఎన్నికల సంఘం తుది పోలింగ్‌ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్‌ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్‌ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

click me!