నిరసనకు నాలుగేళ్ల బాలుడా: షాహీన్ బాగ్ ఘటనపై సుప్రీం ఆగ్రహం

By telugu teamFirst Published Feb 10, 2020, 4:34 PM IST
Highlights

షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శనకు ప్రతి రోజూ తల్లితో పాటు వస్తూ చలికి జలుబు చేసి ఊపిరాడక మరణించిన జహాన్ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది. లాయర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శనకు హాజరవుతూ నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో సీఏఏకు వ్యతిరేకంగా సుదీర్ఘ నిరసన ప్రదర్శన జరుగుతున్న విషయం తెలిసిందే.

నాలుగేళ్ల బాలుడు నిరసన ప్రదర్శనకు వెళ్లవచ్చునా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. షాహీన్ బాగ్ లో తల్లుల కోసం పిల్లలు నిరసన ప్రదర్శనకు వస్తున్నారంటూ న్యాయవాదులపై సుప్రీంకోర్టు మండిపడింది. 

నాలుగేళ్ల బాలుడి మృతిపై 12 ఏళ్ల నేషనల్ బ్రేవరీ అవార్డు విన్నర్ రాసిన లేఖ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డేకు అందింది. దాంతో ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బాలుడి మృతిపై విచారణ జరిపించాలని జెన్ గున్రాత్ అనే బ్రేవరీ అవార్డు విజేత తన లేఖలో కోరింది. 

నాలుగేళ్ల మొహమ్మద్ జహాన్ ప్రతి రోజూ తన తల్లితో పాటు షాహీన్ బాగ్ లో జరుగుతున్న నిరసన ప్రదర్శనకు హాజరవుతూ వచ్చాడు. జలుబుతో ఊపిరాక అతను జనవరి రాత్రి మరణించాడు. 

Also Read: ప్రతి రోజూ షహీన్ బాగ్ నిరసనకు తల్లితో వచ్చేవాడు: నాలుగేళ్ల బాలుడి మృతి

గ్రేటా తున్ బెర్గ్ అనే పాప నిరసన ప్రదర్శనలో పాల్గొని పిల్లల గురించి ప్రస్తావించినప్పుడు పాఠశాలలో పాకిస్తానీగా అభివర్ణిస్తున్నారని కొందరు లాయర్లు షాహెన్ బాగ్ నిరసనకారుల తరఫున వాదిస్తూ అన్నారు.

అసందర్భమైన వ్యాఖ్యలు చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి బోబ్డే లాయర్లను హెచ్చరించారు. అసందర్భమైన వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే నిలువరిస్తామని హెచ్చరించారు. ఇది కోర్టు అని, మాతృభూమి పట్ల తాము అత్యున్నతమైన గౌరవం చూపుతామని అన్నారు. 

click me!