Delhi Air Pollution : ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో వెంటనే కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులు కూడా పంట వర్థ్యాల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.
Delhi Air Pollution : దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా 'వెరీ పూర్' నుంచి 'తీవ్రమైన' కేటగిరీల మధ్య గాలి నాణ్యత ఉంటోంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని అత్యవసర చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. కాలుష్య స్థాయిలు తగ్గాలని, రేపటి కోసం వేచి చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలోని ప్రతీ ఇళ్లు వెలిగిపోతోంది - ప్రధాని నరేంద్ర మోడీ..
ఢిల్లీలో సరి-బేసి పథకం అమలుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ప్రాంతంలో కురిసిన వర్షాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలు ప్రార్థనలు మాత్రమే చేయాలని, కొన్నిసార్లు గాలి వచ్చి సహాయపడుతుందని, కొన్నిసార్లు వర్షాలు కురుస్తాయని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు. ‘‘ప్రజల ప్రార్థనలు విని దేవుడు జోక్యం చేసుకుని ఉండవచ్చునని, అయితే దీని
ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పినట్టు కాదు’’ అని అన్నారు.
వ్యవసాయ మంటలను ఆపాలని తాము కోరుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘మేము ఒక పద్ధతిని సూచించాము, మీరు కోరుకున్న విధంగా చేయండి. కానీ వ్యవసాయ వర్థ్యాల మంటలు ఆగాలి. వ్యవసాయ మంటలను ఆపడానికి కొన్ని అత్యవసర చర్యలు అవసరం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఓడలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
పంజాబ్ లో నీటి మట్టాన్ని పునరుద్ధరించడానికి దీర్ఘకాలిక చర్యగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రైతులు కూడా సమాజంలో ఒక భాగమని, వారు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది. అయితే వారి అవసరాలకు మనం మరింత స్పందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ మనుషులను చావనివ్వలేమని తెలిపింది. పంజాబ్ లో రైతులు బాగా వ్యవస్థీకృతంగా ఉన్నారని, రైతు సంఘాలతో మాట్లాడి వారిని ఎందుకు ప్రోత్సహించడం లేదని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాలుష్య స్థాయి తగ్గాలి, రేపు వేచి చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సరి-బేసి విధానం ఖరారు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం చేసిన వాదనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘‘పనిచేయకుండా ఉండటానికి ప్రయత్నించవద్దు, ఆపై భారాన్ని కోర్టుకు బదిలీ చేయండి’’ అని పేర్కొంది. పంజాబ్ లో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో వరి సాగును దశలవారీగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.