ఓడిశాకు చెందిన ఓ షిప్ చెన్నైలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు కార్మికులకు గాయాలు అయ్యాయి. షిప్ లో రిపేర్ చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది.
తమిళనాడులోని చెన్నై పోర్టులో ఓ షిప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళల స్థితిగతులను బట్టే.. దేశ విలువ ఆధారపడి ఉంటుంది - సీజేఐ చంద్రచూడ్
వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ఓ నౌక ఇంజిన్ లో సమస్య తలెత్తడంతో రిపేర్ కోసం అక్టోబర్ 30న చెన్నై పోర్టుకు చేరుకుంది. దానిని రిపేర్ చేసేందుకు కార్మికులు గ్యాస్ కట్టర్ ను ఉపయోగించారు. అయితే గ్యాస్ కట్టర్ నుంచి వచ్చిన మంటలు పైప్ లైన్ పై పడటంతో ఓడలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ అగ్నిప్రమాదంలో తొండియార్ పేటకు చెందిన కార్మికుడు సహాయ తంగరాజ్ అక్కడికక్కడే మరణించారు. జాషువా, రాజేష్, పుష్పలింగం అనే మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని కీల్పాక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై హార్బర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.