దీపావళి పండగ సందర్భంగా ప్రజలు దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. నేడు ప్రజా సంక్షేమ పథకాలతో ప్రతీ ఇళ్లూ వెలిగిపోతోందని చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో ఓ వీడియోను షేర్ చేశారు.
దేశం మొత్తం దీపావళి పండగకు సిద్ధమయ్యింది. అంగరంగ వైభవంగా పండగ జరపుకునేందుకు అందరూ సన్నదమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పండగ వాతావరణం మొదలయ్యింది. ప్రజలు తమ ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరించుకుంటున్నారు. పిండి వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. కాగా.. ఈ పండగ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మై గవ్ ఇండియా (MyGovIndia) పోస్ట్ చేసిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు చేశారు.
అందులో ‘‘దీపావళి పండుగ రోజున దేశంలోని ప్రతీ ఇల్లు మన ప్రజా సంక్షేమ పథకాలతో వెలుగుతున్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది.’’ అని ప్రధాని పేర్కొన్నారు. దీంతో పాటు దేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
मुझे बहुत संतोष है कि दीपावली के त्योहार पर जनकल्याण की हमारी योजनाओं से आज देश का हर घर रोशन है। https://t.co/yZFJDP5m58
— Narendra Modi (@narendramodi)
కాగా.. మై గవ్ ఇండియా విడుదల చేసిన వీడియోలో ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ.. డిజిటల్ ఇండియా నుండి స్టార్టప్‌ల వరకు మోడీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలోని ప్రతీ ఇల్లు ఎలా వెలుగుతుందో వివరించారు. ‘‘సంతోషం లేకుండా, బహుమతులు లేకుండా దీపావళి అసంపూర్ణంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరో తమ నూతన ఇంటిని ప్రారంభించుకుంటున్నారు. మరొకరు కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ నుండి విముక్తి పొంది గ్యాస్‌తో మిఠాయిలు చేయడం ప్రారంభించారు. మరొకరి ఖాతాలోకి ఒక్క క్లిక్ తో డబ్బు జమ అయ్యింది. మరోవైపు ఓ మహిళ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎక్కడో ఒక నిరుపేద వ్యక్తికి ఉచిత వైద్యం అందింది.’’ అని చెప్పారు.
ఇంకా ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది భవిష్యత్తు ఒక ఆలోచనతో వెలిగిపోతుంది. అవును.. దీపావళి అంటే ఇదే. మన దేశం ప్రతిరోజూ దీపావళిని జరుపుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పథకాల కింద, కొంతమంది ఇల్లు, కొంత ఉచిత గ్యాస్‌ను బహుమతిగా ఇస్తున్నారు. కాబట్టి ఈ దీపావళి ఈ ఆనందం, ఈ దీపావళి, ఇలాగే ఉండాలని కోరుకుందాం. ప్రతి ప్రణాళిక ఒక బహుమతి, దేశం పండుగను జరుపుకుంటుంది.’’ అని తెలిపారు.