delhi air pollution :సరి-బేసి స్కీమ్ అసలెప్పుడైనా సక్సెస్ అయ్యిందా ? ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడ్డ సుప్రీంకోర్టు

By Asianet News  |  First Published Nov 7, 2023, 3:12 PM IST

delhi air pollution : ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న సరి-బేసి విధానం ఎప్పుడైనా విజయవంతమైందా ? అంటూ ప్రశ్నించింది. 
 


Air pollution in Delhi-NCR:దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కప్పేసింది. నగర ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలపై, ముఖ్యంగా దాని ప్రతిష్టాత్మక సరి-బేసి కారు రేషనింగ్ పథకంపై మంగళవారం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ డీబీ చంద్రేగౌడ మృతి.. ఇందిరా గాంధీ కోసం పదవిని త్యాగం చేసిన నేత ఇక లేరు..

Latest Videos

దీపావళి తర్వాత గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందనే అంచనాలు రావడంతో నాలుగేళ్ల తర్వాత సరి-బేసి పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ పథకం వల్ల సరి-బేసి నంబర్ ప్లేట్ల ఆధారంగా కార్లు నగరంలో ప్రయాణించాల్సి ఉంటుంది. వాహన ఉద్గారాలను తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

అయితే ఇది అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదని తాజాగా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీ వాయు కాలుష్య సమస్యలపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘‘ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేశారు, కానీ ఇది ఎప్పుడైనా విజయవంతమైందా? అంతా ఆప్టిక్స్.’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ఉద్దేశించిన విస్తృత ఉత్తర్వులలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఏమైనా చేయండి.. కానీ పంట వ్యర్థాలను కాల్చడం ఆపండి..-పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఎందుకంటే ?

అలాగే రైతులు పంట వ్యర్థాలను కాల్చడాన్ని తక్షణమే నిలిపివేయాలని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మునిసిపల్ ఘన వ్యర్థాలను బహిరంగంగా కాల్చకుండా హామీ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, దానికి అనుగుణంగా సరి-బేసి విధానాన్ని రూపొందిస్తామని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సయీద్ తెలిపారని ‘ఇండియా టుడే’ పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మంగళవారం ఉదయం స్వల్పంగా తగ్గాయి. వరుసగా ఐదు రోజులు తీవ్రమైన గాలి నాణ్యత తర్వాత "చాలా పేలవమైన" కేటగిరీలో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సోమవారం సాయంత్రం 4 గంటలకు నమోదైన 421 నుంచి స్వల్పంగా మెరుగుపడి 394గా నమోదైంది. అలాగే ఘజియాబాద్ లో 338, గురుగ్రామ్ లో 364, నోయిడాలో 348, గ్రేటర్ నోయిడాలో 439, ఫరీదాబాద్ లో 382 ఏక్యూఐ నమోదు అయ్యింది. 
 

click me!