Delhi air pollution : ఢిల్లీ వాయు కాలుష్యం తగ్గించేందుకు ఆప్ సర్కార్ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ ఆధారిత క్యాబ్ ల ప్రవేశాన్ని నగరంలోకి నిషేధించింది.
Delhi air pollution : ఢిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై మండిపడింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశాన్ని నిషేధించింది.
విమానంపై నుంచి పడి ఎయిరిండియా ఇంజినీర్ మృతి.. అసలేం జరిగిందంటే ?
ఢిల్లీలో మొత్తం గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీ నమోదైన మరుసటి రోజే 'తీవ్రమైన' కేటగిరీకి పడిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం ఉదయం 7 గంటలకు నగరంలో మొత్తం వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 421గా నమోదైంది.
విజయసాయిరెడ్డి గురివింద గింజ మాటలు మానుకోవాలి - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ
ముఖ్యంగా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో అక్టోబర్, నవంబర్ నెలల్లో వాయు కాలుష్యం సమస్యతో సతమతమవుతున్న ప్రజల ఆందోళనలను తగ్గించడానికి సుప్రీంకోర్టు ప్రతీ సంవత్సరం అనేక ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా కూడా ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.