Maharashtra :  దూసుకెళుతున్న రైలుపై పడిపోయిన కారు... ముగ్గురు దుర్మరణం

By Arun Kumar P  |  First Published Nov 8, 2023, 2:25 PM IST

కారు ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్తకు  రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే నివాళి అర్పించారు. 


మహారాష్ట్ర : పట్టాలపై వేగంగా దూసుకెళుతున్న రైలుపై అదుపుతప్పిన ఓ కారు పడిపోయింది. బ్రిడ్జిపై నుండి అమాంతం ఎగిరి రైలుపై పడిపోయింది కారు. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మృతిచెందారు. కారు పడింది గూడ్స్ రైలుపై కావడంతో పెను ప్రమాదం తప్పింది. 

వివరాల్లోకి వెళితే... రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్త ధర్మేంద్ర గైక్వాడ్(41) తన బంధువులు మంగేశ్ జాదవ్, నితీన్ జాదవ్ లతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా మహారాష్ట్రలోని కర్ణత్ వైపు వెళుతుండగా ఊహించని ఘోరం జరిగింది. తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు కర్ణత్-పన్వేల్  రైల్వేస్టేషన్ల మధ్యగల బ్రిడ్జిపై అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఇదే సమయంలో పట్టాలపై గూడ్స్ రైలు వెళుతుండటంతో దానిపై ఈ కారు పడి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు  కోల్పోయారు. 

Latest Videos

undefined

ఈ ప్రమాదంపై సమాచారం  అందినవెంటనే రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ధర్మేంద్ర మృతికి కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంతాపం తెలిపారు. 

ఈ ప్రమాదం కారణంగా దెబ్బతిన్న గూడ్స్ రైలు గంటసేపటికి పైగా అక్కడే నిలిచిపోయింది.  దీంతో రూట్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రైల్వే సిబ్బంది గూడ్స్ రైలును అక్కడినుండి తరలించే ఏర్పాటుచేసి రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. 
 
 

click me!