
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి Rajnath Singh కి కరోనా సోకింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. సోమవారం నాడు మధ్యాహ్నం కేంద్ర మంత్రి Corona పరీక్షలు చేయించుకొన్నారు. ఈ పరీక్షల్లో కరోనా నిర్ణారణ అయింది. తనకు కరోనా స్వల్ప లక్షణాలున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తాను Home quarantine లో ఉన్నానని మంత్రి చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.
ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక వెబ్‌నార్ లో ప్రసంగించారు. సాయుధ దళాలలో చేరడానికి బాలికలకు అవకాశాలను కల్పించడానికి దేశంలో 100 కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టుగా మంత్రి ప్రకటించారు.
గత 24 గంటల్లో దేశంలో 1.79 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. దాదాపుగా 10 రోజుల క్రితం దేశంలో సగటున కరోనా కేసులు 10 నుండి 15 వేల కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దేశంలో 1,51,94,05,951 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. నిన్న దేశంలో 13,52,717 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 69,15,75,352 శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్టుగా వెల్లడించింది.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. ఇప్పటివరకు దేశంలో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,552 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,216 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 529 కేసులతో రాజస్తాన్ రెండో స్థానంలో ఉంది.
మహారాష్ట్రలో 1,216, రాజస్తాన్‌లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, హర్యానాలో 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్‌లో 113, ఒడిశాలో 74, ఆంధ్రప్రదేశ్‌లో 28, పంజాబ్‌లో 27, పశ్చిమ బెంగాల్‌లో 27, గోవాలో 19, మధ్యప్రదేశ్‌లో 10, అస్సోంలో 9, ఉత్తరాఖండ్‌లో 8, మేఘలయాలో 4, అండమాన్ నికోబార్‌లో 3, చంఢీఘర్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 3, పుదుచ్చేరిలో 1, చత్తీస్‌గఢ్‌లో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.