నేడే ప్రపంచ హిందీ దినోత్సవం.. ఈరోజే ఎందుకు జరుపుకుంటారు..?

By Ramya news teamFirst Published Jan 10, 2022, 4:26 PM IST
Highlights

 1949లో మొదటిసారి హిందీని భారతదేశం... అధికారిక భాషగా గుర్తించి.. స్వీకరించింది. అప్పటి నుంచి ప్రపంచ హిందీ దినోత్సవం నాడు హిందీ భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తూ వస్తున్నారు.

ప్రతి సంవత్సరం జనవరి 10వ తేదీన హిందీ ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిందీ భాషకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో.. ఈ రోజున ఈ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ వార్షికోత్సవం (World Hindi Conference) సందర్భంగా... ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. మొదటిసారి 1975లో ఇది ప్రారంభమైంది. 

అసలు.. ఈ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?

కేంద్ర ప్రభుత్వం... హిందీ భాషను కూడా అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించిన సందర్భంగా జాతీయ హిందీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 1949లో మొదటిసారి హిందీని భారతదేశం... అధికారిక భాషగా గుర్తించి.. స్వీకరించింది. అప్పటి నుంచి ప్రపంచ హిందీ దినోత్సవం నాడు హిందీ భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తూ వస్తున్నారు.

నాగపూర్‌ లో 1975లో తొలిసారి ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ వార్షికోత్సవం జరిగింది. అప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) ఈ కాన్ఫరెన్స్‌ని ప్రారంభించారు. ఆ రోజున కాన్ఫరెన్స్‌కి ముఖ్య అతిథిగా మారిషస్ ప్రధానమంత్రి సీవూసాగుర్ రామ్ గూలమ్ వచ్చారు. ఈ సదస్సుకు 30 దేశాల నుంచి 122 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

click me!