Coronavirus: యూపీలో క‌రోనా థ‌ర్డ్ వేవ్.. అంత ప్ర‌మాద‌మేమీ లేద‌న్న సీఎం యోగి !

By Mahesh Rajamoni  |  First Published Jan 10, 2022, 4:13 PM IST

Coronavirus: దేశంలో క‌రోనా క‌ల్లోలం రేపుతున్న‌ది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ అడుగుపెట్టింద‌న్నారు. అయితే, దీనివ‌ల్ల అంత ప్ర‌మాద‌మేమీ లేద‌ని పేర్కొన్నారు.
 


Coronavirus:  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. చాలా దేశాల్లో దీని ప్ర‌భావం అధిక‌మైంది. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్‌-19 కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ సైతం చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ గ‌త రెండు వారాల నుంచి క్ర‌మంగా క‌రోనా వైర‌స్ కొత్త కేసుల క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోకి Coronavirus థ‌ర్డ్ వేవ్ అడుగుపెట్టింద‌ని అన్నారు. అయితే దీనివల్ల అంతగా ప్రమాదమేమీ లేదని ఆయ‌న వెల్ల‌డించారు. కరోనా వైరస్ (COVID-19) బారిన‌ప‌డుతున్న వారిలో లక్ష‌ణాలు లేని వారే అధికంగా ఉన్నార‌ని తెలిపారు. 

సోమ‌వారం నాడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. యూపీలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ అడుగు పెట్టింది. అయితే దీని వ‌ల్ల అంత ప్ర‌మాద‌మేమీ లేద‌ని తెలిపారు. కరనా మహమ్మారి (Coronavirus) బారిన‌ప‌డుతున్న వారు పెరుగుతుండ‌టంతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 33,900 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులున్నాయని వెల్ల‌డించిన ఆయ‌న‌.. 90 శాతం మందిలో కోవిడ్‌-19 వ్యాధి లక్షణాలు లేవని అన్నారు. ప్ర‌స్తుతం వీరంద‌రూ కూడా హోం ఐసొలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డ వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు.COVID-19 రోగుల సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు. అలాగే, క‌రోనా మహమ్మారి (Coronavirus) బారిన‌ప‌డ్డ‌వారికి  అవ‌స‌ర‌మైన మెడికల్ కిట్స్ సైతం అందిస్తున్నామ‌ని తెలిపారు.

Latest Videos

undefined

ఇదిలావుండ‌గా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరుగుతున్న‌ది. కొత్త కేసులు రోజురోజుకూ పెరుతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో యూపీలో కొత్త‌గా 7,695  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  ఇదే స‌మ‌యంలో కోవిడ్‌-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు 17,37,550కి చేరుకున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి (Coronavirus) కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 22,928 కి పెరిగింది. కొత్త‌గా సంభ‌వించిన‌ క‌రోనా మ‌ర‌ణాల్లో మీరట్, ప్రయాగరాజ్, బులంద్‌షహర్, బుదౌన్‌లో ఒక్కో మరణం చోటుచేసుకుంది.  గౌతం బుథ్ నగర్, ఘజియాబాద్‌లలో క‌రోనా వైరస్ (Coronavirus) క్రియాశీల కేసులు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో సుమారు 30.44 శాతం ఇక్కడి నుంచే నమోదయ్యాయి. ఒక్క‌ గౌతం బుధ్ నగర్‌లోనే గ‌త 24 గంట‌ల్లో 1,100కు పైగా క‌రోనా వైర‌స్ కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోనూ వేయికి పైగా న‌మోదుకావ‌డంతో స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

కాగా, భారత్ లో  గత 24 గంటల్లో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక, ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

click me!