నవంబర్ 10న దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల విక్రయం

Published : Oct 21, 2020, 04:12 PM IST
నవంబర్ 10న దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల విక్రయం

సారాంశం

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తిని ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన విక్రయించనున్నారు.ఖేడ్ తాలుకాలోని రత్నగిరి జిల్లాలోని కొంకన్ గ్రామంలో ఈ ఆస్తులున్నాయి.స్మగ్లర్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్ యాక్ట్ (ఎస్ఏఎఫ్ఎంఏ) కింద వేలం వేయనున్నారు.

ముంబై:అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తిని ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన విక్రయించనున్నారు.ఖేడ్ తాలుకాలోని రత్నగిరి జిల్లాలోని కొంకన్ గ్రామంలో ఈ ఆస్తులున్నాయి.స్మగ్లర్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్ యాక్ట్ (ఎస్ఏఎఫ్ఎంఏ) కింద వేలం వేయనున్నారు.

దావూద్ అనుచరుడు ఇక్బాల్ మిర్చికి చెందిన ఆస్తులను కూడ అదే రోజున విక్రయించనున్నారు. రత్నగిరి జిల్లాలోని ఖేడ్ తాలూకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వీకులు ఉండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్ కు స్థిరాస్తులున్నాయి. 

ఇక్కడ ఉన్న బంగ్లాలోనే 1980లలో దావూద్ కుటుంబసభ్యులు నివాసం ఉండేవారు. ఈ భవనాన్ని విలాసవంతంగా మార్చి తన తల్లి పేరు మీద రాయించాడు. 1993లో ముంబైలో బాంబు పేలుళ్ల తర్వాత ఈ బంగ్లాను దావూద్ కుటుంబసభ్యులు ఖాళీ చేశారు. 

అప్పటి నుండి ఈ భవనం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థలో ఉంది.గత ఏడాదే ఈ ఆస్తుల విలువను నిర్ధారించారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ ఆస్తులను విక్రయించనున్నారు. ఇదిలా ఉంటే 1993 బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం ముంబై ని విడిచి వెళ్లాడు. దావూద్ కోసం భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.దావూద్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలనే మాట మార్చిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్.. ఆయన అందుకునే జీతం ఎంతో తెలుసా?
నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point