సినిమాలో మాదిరిగా: లారీ నుండి రూ. 15 కోట్ల ఫోన్ల చోరీ

By narsimha lodeFirst Published Oct 21, 2020, 3:28 PM IST
Highlights

మొబైల్ లోడుతో వెళ్తున్న  కంటైనర్ లారీ డ్రైవర్లపై దాడికి దిగి రూ. 15 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన  తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ చోటు చేసుకొంది.ఈ ఘటనపై డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


చెన్నై: మొబైల్ లోడుతో వెళ్తున్న  కంటైనర్ లారీ డ్రైవర్లపై దాడికి దిగి రూ. 15 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన  తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ చోటు చేసుకొంది.ఈ ఘటనపై డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన ఫోన్లను తీసుకెళ్తున్నారు.కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు నుండి ముంబైకి ఎంఐ మొబైల్స్ ను తీసుకెళ్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ పై దాడి చేశారు దొంగలు.

కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలో కంటైనర్ ను దుండగులు అడ్డుకొన్నారు. డ్రైవర్లను చితకబాది రూ. 15 కోట్ల విలువైన  మొబైల్స్ ను చోరీ చేశారు. 

గతంలో ఏపీ రాష్ట్రంలోని నగరి సమీపంలో కూడ సెల్ ఫోన్లను తరలిస్తున్నకంటైనర్ లారీ డ్రైవర్ పై దాడికి దిగి లారీ నుండి మొబైల్స్ ను తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలో కూడ ఇదే తరహాలో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

click me!