కూతురి లవర్‌పై కారంపొడి.. కొడుకులతో దాడి.. చివరకు ఏమైందంటే?

Published : Sep 16, 2022, 06:45 PM IST
 కూతురి లవర్‌పై కారంపొడి.. కొడుకులతో దాడి.. చివరకు ఏమైందంటే?

సారాంశం

మహారాష్ట్రలోని పూణెలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌ను కలవడానికి రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఇంటికి బయల్దేరాడు. కానీ, ఆమె తల్లి, ఇద్దరు సోదరులు ఈ విషయం తెలుసుకుని మాటు వేసి రెడీగా ఉన్నారు. ఇంటికి రాకముందే ఆ వ్యక్తిపై కారం పొడి చల్లి దాడి చేశారు.  

పూణె: మహారాష్ట్రలో ఓ మహిళ.. కూతురిని కలవడానికి వచ్చిన వ్యక్తిపై దాడికి దిగింది. తన కూతురి లవర్ పై కారం పొడి చల్లింది. ఇది అదనుగా తీసుకుని ఆమె కొడుకులు ఇద్దరు ఆ వ్యక్తి పై దాడి చేశారు. రాడ్లతో తల పై గట్టిగా బాదారు. చివరకు ఆ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తల పై తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తున్నది. ఈ ఘటన  మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో
పూణెలో చించ్వాడ్‌లోని పోష్ సొసైటీ చోటుచేసుకుంది.

విశాల్ కాస్బే అనే యువకుడికి ఓ అమ్మాయితో పరిచయం ఉన్నది. ఆ అమ్మాయి, అబ్బాయి విశాల్ కాస్బే ప్రేమించుకుంటున్నారు.
మంగళవారం రాత్రి ప్రేయసిని కలవడానికి విశాల్ కాస్బే ఆమె ఇంటికి బయల్దేరాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తల్లి, ఆ అమ్మాయి సోదరులు గమనించారు.

విశాల్ కాస్బే అమ్మాయిని కలవడానికి ముందే ఆమె తల్లి, ఇద్దరు మైనర్ సోదరులు ఇంటి నుంచి బయటకు వచ్చారు. విశాల్ కాస్బేను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చిన్నపాటి వాగ్వాదం జరిగింది.

దీంతో ఆ మైనర్ల తల్లి కారం పొడి తెచ్చి విశాల్ కాస్బేపై చల్లింది. దీంతో విశాల్ కాస్బే నిస్సహాయుడిగా మారాడు. ఈ సమయాన్ని అదునుగా తీసుకుని విశాల్ కాస్బే ప్రేయసి సోదరులు ఆయన పై దాడికి దిగారు. రాడ్లతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారు స్పాట్ నుంచి పారిపోయారు.

ఆ సొసైటీకి చెందిన కొందరు బాధితుడు విశాల్ కాస్బేను సమీప హాస్పిటల్‌లో చేర్చారు. ఆయనకు ప్రస్తుతం చికిత్స అందుతున్నది. ఆయన తలపై ఎక్కువ గాయాలు అయినట్టు తెలుస్తున్నది.

పూణె పోలీసులకు ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసుకుని సదరు మహిళను అరెస్టు చేశారు. ఆమె ప్రస్తుతం జైలులో ఉన్నది. కాగా, ఆమె ఇద్దరు మైనర్ కుమారులను జువెనైల్ కరెక్షన్ హోమ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System