మిషన్ ఇంపాజిబుల్ సినిమా తరహాలోనే: కేబుల్ వైర్లపై పిల్లి వాకింగ్, నెట్టింట్లో వీడియో వైరల్

By narsimha lode  |  First Published Jan 6, 2024, 3:56 PM IST


కేబుల్ వైర్లపై  పిల్లి నడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో  సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


న్యూఢిల్లీ: కేబుల్ వైర్లపై  పిల్లి  నడుస్తున్న వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు  కొడుతుంది.  ఈ వీడియో వైరల్ గా మారింది.   టామ్ క్రూజ్  సినిమా మిషన్ ఇంపాజిబుల్  గుర్తుకు తెస్తుందని  నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  ఈ వీడియోను  చూసేందుకు  నెటిజన్లు  ఎగబడుతున్నారు.

మిషన్ ఇంపాజిబుల్ శీర్షికతో  ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  రెండు విద్యుత్ వైర్లపై  పిల్లి నడుస్తున్న సమయంలో వీడియోను చిత్రీకరించి పోస్టు చేశారు.ఈ వీడియోకు  మిషన్ ఇంపాజిబుల్ థీమ్ మ్యూజిక్ ను కూడ సెట్ చేశారు. 

Latest Videos

also read:విమానంలో మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో

ఈ నెల  4వ తేదీన ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో వైరల్ గా మారింది.  ఈ వీడియో  3.7 మిలియన్ల  మంది  చూశారు. పిల్లులు నిజంగా సాహసోపేతమైనవని ఓ నెటిజన్ ఈ వీడియో చూసిన తర్వాత వ్యాఖ్యానించారు.  పిల్లి సర్కస్  విస్మయం కల్గిస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు.

 

Mission impawsible.. 😅 pic.twitter.com/MYpcctzNa0

— Buitengebieden (@buitengebieden)

ఈ పిల్లికి  కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలున్నాయని మరొకరు వ్యాఖ్యానించారు.  పిల్లులు తరచుగా అసాధ్యం అనిపించేలా చేస్తాయన్నారు. ప్రత్యేకించి అవి ఎత్తైన ప్రదేశాలు లేదా ఇరుకైన ప్రదేశాల్లో  సర్కస్ ఫీట్లు  చేస్తాయని మరొకరు వ్యాఖ్యానించారు.

click me!