రాముడి మీద స్వస్తి మెహుల్ అనే వర్ధమాన గాయని పాడిన ఒక అద్భుతమైన పాటను మోడీ ట్విట్టర్ లో షేర్ చేశారు.
అయోధ్య : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, శ్రీరాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం నగరం వేగంగా సిద్ధమవుతోంది. ప్రపంచమంతా ఈవేడుకకోసం ఎదురుచూస్తోంది. జనవరి 22కు ఇంకా ఎన్నో రోజులు లేవు. కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఆలయ ప్రారంభోత్సవం, రామ్ లాలా ప్రతిష్ఠాపన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. నగరం మొత్తం పండుగ శోభతో కళకళలాడుతోంది.
ఈ సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ పాటను షేర్ చేయడం వైరల్ గా మారింది. రాముడి మీద స్వస్తి మెహుల్ అనే వర్ధమాన గాయని పాడిన ఒక అద్భుతమైన పాటను మోడీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘రాముడు వస్తున్నాడు.. సీతమ్మ తల్లితో వస్తున్నాడు.. తమ్ముడు లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి వస్తున్నాడు.. నా కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతాను..’ అంటూ సాగే ఈ పాట విపరీతంగా వైరల్ అవుతోంది.
అయోధ్యరాముడిని రామ్ లల్లా అని ఎందుకు పిలుస్తారు?
ఈ పాటను మెహుల్ రాముడికి అంకితం చేసింది. ఈ పాటను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ప్రశంసించారు ప్రధాని మోడీ. ఈ పాట ప్రధానితో సహా చాలా మంది హృదయాలను దోచుకుంది. ఈ పాట రామాలయ ప్రారంభోత్సవ వేడుకమీద మరింత ఆసక్తినిపెంచుతోంది.
ఈ పాటకు చెందిన యూట్యూబ్ లింక్ ను షేర్ చేస్తూ హిందీలో ట్వీట్ చేశారు మోడీ. దీంట్లో.. "ఈ స్వస్తి జీ భజన ఒకసారి వింటే చాలు, చెవుల్లో చాలాసేపు అలా మార్మోగుతూనే ఉంటుంది. మనస్సును భావోద్వేగంలో ముంచేస్తుంది’’ అని రాసుకొచ్చారు. పోస్ట్‌ను షేర్ చేసిన గంటలోనే 300,000 వ్యూస్ వచ్చాయి.
ఇదిలా ఉండగా, వేలాది మంది ప్రముఖులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే అయోధ్య రామాలయప్రారంభోత్సవ కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్-ప్రతిష్ఠ (పవిత్ర) వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16న ప్రారంభమవుతాయి.
వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లాకు పట్టాభిషేకం చేసే ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత్ మహౌత్సవాన్ని నిర్వహిస్తారు. 1008 హుండీ మహాయజ్ఞం కూడా నిర్వహించబడుతుంది, ఇందులో వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. మహా సంప్రోక్షణ కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఈ టెంపుల్ సిటీకి చేరుకునే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి అయోధ్యలో అనేక డేరా నగరాలు నిర్మించబడుతున్నాయి.
स्वस्ति जी का ये भजन एक बार सुन लें तो लंबे समय तक कानों में गूंजता रहता है। आंखों को आंसुओं से, मन को भावों से भर देता है। https://t.co/0nD3XmAbzk
— Narendra Modi (@narendramodi)