దళిత విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారం.. నెలల తరబడి అఘాయిత్యం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

By Asianet NewsFirst Published Jun 7, 2023, 12:33 PM IST
Highlights

పదో తరగతి చదివే దళిత విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. మొదటిసారి లైంగిక దాడికి ఒడిగట్టిన సమయంలో వీడియోలు రికార్డు చేసి, వాటితో ఆమెను బ్లాక్ మెయిల్ చేసేవాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. 

యూపీలో దారుణం వెలుగులోకి వచ్చింది. బరేలీ జిల్లా నవాబ్ గంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ (35) పదో తరగతి చదివే దళిత విద్యార్థినిపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దుశ్చర్యను వీడియో తీశాడు. వాటితో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తన సోదరుడికి విషయం చెప్పింది. వారిద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో దారుణం.. చెక్క పెట్టెలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితి మృతి

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. నవాబ్ గంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 19 ఏళ్ల దళిత బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే ఫిబ్రవరిలో బోర్డు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకునే ఫారంలో పొరపాటు జరిగిందని ఆ ప్రిన్సిపల్ బాలికతో చెప్పాడు. దానిని సరిచేయకపోతే బోర్డు పరీక్షలకు హాజరుకానివ్వబోమని బాలికను హెచ్చరించాడు. పరీక్షకు హాజరయ్యేలా మార్పులు చేయాలంటే తనను ఇంటికి వచ్చి కలవాలని సూచించాడు. 

పరీక్షలు రాయలేననే భయంతో బాధితురాలు అతడు చెప్పిన ఇంటికి వెళ్లింది. దీంతో ఆమెపై ఆ ఇంట్లోనే ప్రిన్సిపల్ లైంగిక దాడికి ఒడిగట్టాడు. దీనిని వీడియో కూడా తీశాడు. ఆ వీడియో ఆధారంగా ఆమెను బ్లాక్ చేయడం మొదలుపెట్టాడు. పాఠశాల తరగతులు పూర్తయిన తరువాత ప్రిన్సిపల్ తను ఆఫీసుకు బాధితురాలిని రప్పించుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా పదే పదే జరుగుతుండటంతో బాధితురాలు విసిగెత్తిపోయింది. తన సోదరుడికి తనపై ప్రిన్సిపల్ చేస్తున్న దుశ్చర్యను వివరించింది.

చనిపోయాడని భావించి మృతదేహాల గదికి.. కాపాడిన తండ్రి.. ఒడిశా ప్రమాదంలో వెలుగులోకి మరో ధీన గాథ

అనంతరం బాధిత విద్యార్థి, ఆమె సోదరుడు కలిసి నవాబ్ గంజ్ పోలీసులను ఆదివారం ఆశ్రయించారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలు నిజమేనని తేలిందని ఎస్ హెచ్ వో రాజీవ్ కుమార్ తెలిపారు. వేరొకరు చిత్రీకరించిన 8 వీడియోను తాము గుర్తించామని, దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామని అన్నారు. బాధితురాలు, ఆమె సోదరుడి వాంగ్మూలాలను నమోదు చేశామని తెలిపారు. విద్యార్థినిని మంగళవారం వైద్య పరీక్షలకు పంపించామని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని చెప్పారు.

ముస్లింతో లేచిపోయిన యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించి మనసు మార్చిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ట్విస్ట్ ఏంటంటే ?

నిందితుడికి వివాహమైందని, అతడు తన కుటుంబతో కలిసి ఫిలిభిత్ లో నివసిస్తున్నాడని చెప్పారు. నిందితుడిపై పరశురామ్ పై ఐపీసీ సెక్షన్ 376-2ఎన్ (ఒకే మహిళపై పదేపదే అత్యాచారానికి పాల్పడటం), 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. ప్రిన్సిపల్ తన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ.. రాత్రిపూట పాఠశాలకు రావాలని తనను తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడని బాధితురాలు తన వాగ్మూలంలో పేర్కొంది. అతడి వద్ద వీడియోలు ఉండటంతో తాను మౌనంగా ఉన్నానని తెలిపింది.

click me!