తనకు ఓటు వేయలేదని దళితుల యువకులపై దాడి, గుంజీలు తీయించి.. ఉమ్ము నాకించి.. ఓ పంచాయతీ అభ్యర్థి దారుణం..

Published : Dec 13, 2021, 08:53 AM IST
తనకు ఓటు వేయలేదని దళితుల యువకులపై దాడి, గుంజీలు తీయించి.. ఉమ్ము నాకించి.. ఓ పంచాయతీ అభ్యర్థి దారుణం..

సారాంశం

దళిత వర్గానికి చెందిన ఇద్దరు ఓటర్లకు తనకు ఓటు వేయమని తాను డబ్బులిచ్చానని, వారు ఇప్పటికీ తనకు ఓటు వేయలేదని బల్వంత్ తిడుతుండడం ఆ వీడియలో వినిపిస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తలను బల్వంత్ సింగ్ అనుచిత మాటలతో దుర్భాషలాడుతూ, వారి చెవులు పట్టుకుని సిట్-అప్‌లు చేయించడం.. వారిని శిక్షించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.  

బీహార్ : బీహార్ లో హేయమైన ఘటన చోటుచేసుకుంది. తనకు ఓటు వేయలేదని దళితులపై అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడో పంచాయతీ అభ్యర్థి. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో పంచాయతీ హెడ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఇద్దరు దళితులపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Panchayat head పదవికి పోటీచేసిన అభ్యర్థి బల్వంత్ సింగ్ తన ఓటమికి Dalit communityపై నిందలు వేశాడు. తన ఓటమికి వారే కారణం అంటూ ద్వేషం పెంచుకున్నాడు. తనకు ఓటు వేయలేదని ఆ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కొట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఎన్నికలు ఎంత చిన్నవైనా, పెద్దవైనా ఓట్ల కోసం డబ్బులు పంచడం కామన్ గా మారిపోయింది. అయితే తమ దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని పగబట్టడం, దాడులు చేయడం, గొడవలకు దిగడం ఇటీవలి కాలంలో అక్కడక్కడా కనిపిస్తుంది. అలాంటి కోవలోకి వచ్చే ఘటనే ఇది. అయితే, ఎన్నికల నియమనిబంధనల ప్రకారం  ఎవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదు అనేది అంచనాగా ఊహించడం తప్ప.. నిర్థారణగా చెప్పలేం. కానీ, ఓ పంచాయతీ అభ్యర్థి మాత్రం తనకు తానే నిర్థారించుకుని ఇద్దరిమీద దాడికి దిగాడు.

Omicron : ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఒమిక్రాన్ కేసు.. దేశవ్యాప్తంగా 38కి చేరుకున్న సంఖ్య..

దళిత వర్గానికి చెందిన ఇద్దరు ఓటర్లకు తనకు ఓటు వేయమని తాను డబ్బులిచ్చానని, వారు ఇప్పటికీ తనకు ఓటు వేయలేదని బల్వంత్ తిడుతుండడం ఆ వీడియలో వినిపిస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తలను బల్వంత్ సింగ్ అనుచిత మాటలతో దుర్భాషలాడుతూ, వారి చెవులు పట్టుకుని సిట్-అప్‌లు చేయించడం.. వారిని శిక్షించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఆ తరువాత బల్వంత్ సింగ్ వారిలో ఒకరిపై శారీరకంగా దాడి చేశాడు. నేలమీద ఉమ్మివేసి, ఆ ఉమ్మును నాకాలంటూ అమానుషంగా బలవంతం చేశాడు. నాకమంటూ బల్వంత్ సింగ్ ఆ దళితుడి మెడ పట్టుకుని బలవంతంగా నేలపైకి వంచడం కనిపిస్తుంది. 

జాక్‌పాట్ కొట్టిన అంబులెన్స్ డ్రైవర్: రూ. కోటీ లాటరీ గెల్చుకొన్న హీరా

ఈరోజు వెలుగులోకి వచ్చిన వీడియో ప్రామాణికతను సదరు మీడియా స్వయంగా ధృవీకరించలేదు. అయితే ఇది తాను కావాలని చేయలేదని, ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి అఘాయిత్యాలు సృష్టిస్తున్నారని బల్వంత్ ఆరోపించాడు. అందుకే వారు స్పృహలోకి వచ్చాక తాను శిక్ష విధించానని చెప్పడం కొసమెరుపు. అయితే, బల్వంత్ వారిద్దరికీ ఓటు వేయమని డబ్బులు ఇచ్చినట్లు వీడియోలో మాటలు నిర్ధారిస్తున్నాయి.

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కంతేష్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసులో చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని మిశ్రా తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu