సైబర్ క్రైం : వృద్ధ జంటనుంచి రూ.4కోట్లు కాజేసిన మాయలేడీ... రూ.11 కోట్లు ఆశచూపి...

By SumaBala Bukka  |  First Published Oct 27, 2023, 7:25 AM IST

ముంబైలో సైబర్ క్రైం నేరస్తులు రెచ్చిపోయారు. ఓ వృద్ధజంటకు రూ.11 కోట్లు ఆశచూపి వారి నుంచి రూ. 4 కోట్లు కొట్టేశారు. 


ముంబై : వృద్ధులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు వారి దగ్గర నుంచి రూ.4.35 కోట్లు కొళ్లగొట్టారు. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. ఆ జంట నుంచి విడతల వారీగా వీరు ఈ సొమ్మును కాజేశారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… ముంబైలో కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 70 ఏళ్ల వయసున్న ఓ వృద్ధ జంట ఉంటుంది. భర్త గతంలో ఓ ప్రముఖ ఐటీ,  కన్సల్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. వీరిద్దరూ ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారు. కాగా, ఈ మే నెలలో మృతురాలికి ఓ ఫోన్ వచ్చింది.  గుర్తుతెలియని ఓ మహిళ ఫోన్ చేసింది. 

సదరు మహిళ తాను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. వృద్ధురాలిని నమ్మించడం కోసం…ఆమె భర్తకు సంబంధించిన అన్ని వివరాలను సరిగా చెప్పింది. అవన్నీ కరెక్ట్ గానే ఉండడంతో ఆ వృద్ధురాలు మహిళ చెప్పేది నిజమే అని నమ్మింది. పిఎఫ్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నా అని మాట్లాడిన మహిళ వృద్ధుడి ఖాతాలో  20యేళ్ల ఉద్యోగ కాలానికి గానూ..  కంపెనీ రూ.4 లక్షలు డిపాజిట్ చేసినట్లుగా  తెలిపింది. అయితే ఇప్పుడు ఆ మొత్తం మెచ్యూర్ అయిందని విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 

Latest Videos

ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు చెప్పకూడదు.. ఢిల్లీ హైకోర్టు సంచలనం తీర్పు

ఇప్పుడా మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటే రూ.11 కోట్లు వస్తుందని నమ్మించింది. దీనికోసం జిఎస్టి, టిడీఎస్, ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని మొత్తం ఆమె తన భర్తకు చెప్పింది.  భర్త కూడా ఇది నిజమే అని నమ్మాడు. ఇంకేముంది కాల్ చేసిన ఆ మహిళ చెప్పినట్లుగా.. ఓ బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేశారు. అలా విడతల వారీగా సెప్టెంబర్ వరకు రూ.4.35  కోట్లు జమ చేశారు. 

అయినా కూడా.. మహిళ చెప్పినట్లు రూ.11 కోట్లు మొత్తం డబ్బులు రాకపోగా ఇంకా కొంత డబ్బులు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన వృద్ధ జంట తమ దగ్గర డబ్బులు లేవని సమాధానం చెప్పారు. వారి సమాధానం విన్న ఆ మహిళ అప్పటివరకు ఎంతో  సౌమ్యంగా మాట్లాడిన ఆమె ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఐటి శాఖకు చెబుతానంటూ బెదిరించింది. వెంటనే తానూ మోసపోయిన విషయాన్ని గమనించిన వృద్ధ జంట మంగళవారం నాడు పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.
 

click me!