Manipur: మరోసారి మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం పొడిగింపు.. ఎన్ని రోజులంటే..?

Published : Oct 27, 2023, 12:52 AM IST
Manipur: మరోసారి మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం పొడిగింపు.. ఎన్ని రోజులంటే..?

సారాంశం

Manipur: మణిపూర్ ప్రభుత్వం మరోసారి మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగించింది.  అక్టోబర్ 31 వరకు నిషేధం అమల్లోకి వచ్చిన. ఈ మేరకు గురువారం అధికారులు సమాచారం అందించారు. 

Manipur: మణిపూర్ ప్రభుత్వం మరోసారి మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని వచ్చే ఐదు రోజుల పాటు అంటే.. అక్టోబర్ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం అధికారులు సమాచారం అందించారు. అయితే, రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటటామని సీఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించిన తరువాత ఈ ప్రకటన వెలుబడటం చర్చనీయంగా మారింది. 

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. "ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే చిత్రాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత వీడియోలను వ్యాప్తి చేయడానికి కొంతమంది సామాజిక వ్యతిరేక అంశాలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించవచ్చనే భయంతో నిషేధం పొడిగించబడింది." అని పేర్కొబడింది. రాష్ట్రంలో భద్రతా దళాలతో బహిరంగంగా ఘర్షణలు, పోలీసుల ముందు నిరసనలు వంటి సంఘటనలు ఇప్పటికీ ఉన్నాయని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) తెలియజేశారు.

ఇంటర్ నెట్ సేవలను నిలిపివేయడం వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అసత్య ప్రచారం, పుకార్లు వ్యాప్తి జరుగుతోంది. ఇంటర్ నెట్ నిలిపివేత వల్ల దేశ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక శక్తులను, కార్యకలాపాలను అడ్డుకోవడం, శాంతి, మత సామరస్యాన్ని కాపాడడం , ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.  

మే 3న హింస చెలరేగడంతో రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్‌ను నిషేధించారు. అయితే, ఇది సెప్టెంబరు 23న పునరుద్ధరించబడింది. ఈ క్రమంలో తప్పిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాల ఛాయాచిత్రాలు వెలువడిన తర్వాత భద్రతా దళాలతో విద్యార్థులు ఘర్షణ పడిన నేపథ్యంలో నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్ 26న మళ్లీ నిషేధించారు.

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu