
cricket world cup 2023 : కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లేకపోతే ముంబైలోని వాంఖడే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగితే భారత్ జట్టు విజయం సాధించేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ ఇండోర్ స్టేడియంలో టీఎంసీ కార్యకర్తలనుద్దేశించి గురవారం ఆమె మాట్లాడారు. దేశ క్రికెట్ జట్టును కాషాయీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశం మొత్తాన్ని కాషాయ రంగులోకి మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే మన భారత ఆటగాళ్లను చూసి గర్విస్తున్నామని చెప్పారు.
Afghanistan embassy : భారత్ లో రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేసిన ఆఫ్ఘనిస్తాన్.. కారణమేంటంటే ?
ప్రాక్టీస్ చేసే సమయంలో కాషాయ జెర్సీలను ప్రవేశపెట్టారని, దీని ద్వారా టీమ్ ను కాషాయీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే ఆటగాళ్లు ప్రతిఘటించారని, దీంతో మ్యాచ్ ల సమయంలో ఆ జెర్సీలు ధరించాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పారు.
కాగా.. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిని ప్రస్తావిస్తూ..భారత్ టీమ్ ఫైనల్ మ్యాచ్ గెలిచేదే అని కానీ, కానీ పనౌటి (ప్రధాని మోడీని ఉద్దేశించి) జట్టును ఓడిపోయేలా చేసిందని అన్నారు. అయితే ఈ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వ్యాఖ్యలపై నవంబర్ 25లోగా సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.
Bomb Threat to Mumbai Airport : ముంబైలో కలకలం... ఈసారి విమానాశ్రయమే టార్గెట్ గా బెదిరింపు
యూపీ మాజీ సీఎం. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా భారత్ ఓటమిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లో కాకుండా మ్యాచ్ లక్నోలో జరిగి ఉంటే టీమిండియాకు ఎంతో మంది ఆశీస్సులు లభించి ఉండేవని అన్నారు. ఇక్కడైతే భారత జట్టుకు విష్ణువు, అటల్ బిహారీ వాజ్ పేయి ఆశీస్సులు లభించేవని తెలిపారు. దీంతో తప్పకుండా భారత్ గెలిచేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి వల్ల ఆటగాళ్ల సన్నద్ధత అసంపూర్తిగా మిగిలిపోయిందని అఖిలేష్ యాదవ్ అన్నారు.