ఇటీవల కాలంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరించిన ఘటన మరువకముందే ఏకంగా ఎయిర్ పోర్టును పేల్చేస్తామంటూ మరో బెదిరింపు మెయిల్ వచ్చింది.
ముంబై : దేశ విదేశీ ప్రయాణికులతో నిత్యం బిజీగా వుండే ముంబై చత్రపతి శివాజీ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు కలకలం రేపాయి. విమానాశ్రయంలోని టెర్మినల్ 2 ని బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతుకులు మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు సెక్యూరిటీని అప్రమత్తం చేసారు.
ముంబై విమానాశ్రయంలో విధ్వంసం సృష్టించకుండా వుండేందుకు తమకు మిలియన్ డాలర్లు ఇవ్వాలని దుండగులు బెదిరించారు. 48 గంటల్లో అడిగిన మొత్తాన్ని బిట్ కాయిన్ల రూపంలో అదించాలని కోరారు. ఈ బెదిరింపు మెయిల్ పై వెంటనే స్పందించిన విమానాశ్రయ అధికారులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
undefined
బెదిరింపు మెయిల్ ఏ ఐడీ నుండి వచ్చిందో గుర్తించేప్రయత్నం చేస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బెదిరించిన దుండగులు ఎవరో గుర్తిస్తామని... త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read More Indian student shot dead in USA : అమెరికాలో భారతీయ విద్యార్థిపై దుండగుల కాల్పులు... దుర్మరణం
ఇదిలావుంటే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో 19 ఏళ్ల తెలంగాణ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిని గణేశ్ రమేశ్ వనపర్దిగా గుర్తించారు.
ముకేశ్ అంబానీకి గతవారం పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ మెయిల్స్ వచ్చాయి. వరుసగా మూడు బెదిరింపు మెయిల్స్ రావడంతో ముకేశ్ అంబానీ ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇంచార్జీ ముంబయి పోలీసులకు అక్టోబర్ 27వ తేదీన ఫిర్యాదు చేసాడు. దీంతోో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేశారు.
తొలి మెయిల్‌లో రూ. 20 కోట్లు డిమాండ్ చేసి... అనంతరం రూ. 200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో మెయిల్ అంబానీకి వచ్చింది. తదనంతరం రూ. 400 కోట్లు అందించాలని... లేదంటే అంబానీని చంపేస్తామని మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలంగాణ యువకుడే ఈ మెయిల్ చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేసారు.