Bengaluru 'Kambala' buffalo race:బెంగుళూరులో కంబాల రేస్... మూడు రోజులు రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు

By narsimha lode  |  First Published Nov 24, 2023, 10:17 AM IST

బెంగుళూరు నగరంలో కంబల రేసు నిర్వహించనున్నారు.దీంతో  నగరంలో పలు రోడ్లపై  ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని  పోలీసులు సూచించారు. 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో  ఈ వీకేండ్ లో  కంబాలా రేసును నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమంలో సుమారు రెండు లక్షల మంది  ప్రజలు పాల్గొంటారు.  ఈ నెల  25, 26 తేదీల్లో  ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.  కొన్ని ప్రాంతల్లో నగరంలో కొన్ని ప్రాంతాల్లో  కొన్ని ప్రాంతాల్లో  ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

కంబాల రేస్ జరిగే రూట్ వైపు కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణం చేయాలని  బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు  ప్రయాణీకులకు  సూచించారు.

Latest Videos

undefined

బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సిన ప్రయాణీకులు కూడ ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు  సూచించారు.  శుక్ర, శని, ఆదివారాల్లో  ఈ మార్గాల్లో  ప్రయాణాలను మానుకోవాలని కూడ  బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

బెంగుళూరులో  ఆంక్షలు ఉన్న మార్గాలివే

ప్యాలెస్ రోడ్డు: మైసూర్ బ్యాంక్ సర్కిల్ నుండి వసంత నగర్ అండర్ పాస్ వరకు
ఎంవీజయరామ్ రోడ్డు:బీడీఏ జంక్షన్ ప్యాలెస్   రోడ్ నుండి చక్రవర్తి లే ఔట్ వరకు,
వసంతనగర్ అండర్ పాస్ నుండి పాత ఉదయ టీవీ జంక్షన్ వరకు (రెండు మార్గాల్లో)
బళ్లారి రోడ్డు:మేఖ్రి సర్కిల్ నుండి ఎల్ఆర్‌డీఈ జంక్షన్ వరకు
కన్నింగ్ హామ్ రోడ్: బాలేకుండ్రి జంక్షన్ నుండి లే మెరిడియన్ అండర్ పాస్  వరకు
మిల్లర్స్ రోడ్: పాత ఉదయ టీవీ జంక్షన్ నుండి ఎల్ఆర్‌డీఈ జంక్షన్ వరకు
జయమహల్ రోడ్: బెంగుళూరు పరిసర రోడ్లతో సహా జయమహల్ రోడ్ రాజభవనం వరకు

ఈ మూడు రోజుల పాటు ఈ మార్గాల్లో ప్రయాణం చేసే వారు  ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.ప్రతి  ఏటా నవంబర్ నుండి మార్చి వరకు  కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి ,కేరళలోని కాసరగోడ్ తీర ప్రాంత జిల్లాల్లో  ఈ పోటీలు నిర్వహిస్తారు.కంబాల రేస్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో  పిటిషన్లు కూడ దాఖలయ్యాయి.జంతువులపై హింసకు వ్యతిరేకంగా  ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు  కంబాలపై నిషేధం విధించింది. అయితే  కర్ణాటక ప్రభుత్వం  చట్ట సవరణ  చేసింది.  పోటీ నిర్వహణ సమయంలో జంతువులపై హింస చేయవద్దని చట్ట కర్ణాటక సర్కార్ సూచించింది.

 

click me!