మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు పెట్టలేదు: మోడీపై నారాయణ ఫైర్

Published : Mar 15, 2023, 04:24 PM ISTUpdated : Mar 15, 2023, 05:23 PM IST
మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్  బిల్లు ఎందుకు పెట్టలేదు:  మోడీపై నారాయణ ఫైర్

సారాంశం

సంపూర్ణ మెజారిటీ  ఉన్నా కూడా  పార్లమెంట్ లో  మహిళా రిజర్వేషన్ బిల్లును  ఎందుకు  ప్రవేశ పెట్టలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  ప్రశ్నించారు.    

న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లును  మోడీ సర్కార్  పార్లమెంట్  లో  ప్రవేశపెడితే తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని  సీపీఐ  జాతీయ కార్యదర్శి  నారాయణ  చెప్పారు.  

భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో  మహిళా రిజర్వేషన్ బిల్లుపై    న్యూఢిల్లీలో  బుధవారంనాడు  రౌండ్ టేబుల్ సమావేశం  ఏర్పాటు  చేశారు.   ఈ సమావేశానికి  పలు పార్టీల నుండి  ప్రతినిధులు , ఆయా పార్టీల ఎంపీలు  హాజరయ్యారు.  ఈ సమావేశానికి హాజరైన  సీపీఐ  జాతీయ కార్యదర్శి  డాక్టర్ నారాయణ  ప్రసంగించారు. 

వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా  ఉన్న సమయంలో  సీపీఐ నేత  , మాజీ ఎంపీ  గీతా ముఖర్జీ నేతృత్వంలో  కమిటీని  ఏర్పాటు  చేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. దేశ వ్యాప్తంగా  పర్యటించి  మహిళా రిజర్వేషన్ విషయమై  ప్రభుత్వానికి  గీతా ముఖర్జీ కమిటీ  నివేదికను ఇచ్చిందన్నారు. ఆ తర్వాత  కేంద్రంలో  దేవేగౌడ ప్రధానిగా  బాధ్యతలు చేపట్టారన్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే  చోటు  చేసుకొనే ఇబ్బందుల గురించి ఓ నేత  ప్రస్తావిస్తాంచాడన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు ఆ నేత అడ్డుపుల్ల వేశాడని  నారాయణ చెప్పారు. ఆ నేత  పేరును తాను  ఇక్కడ ప్రస్తావించదల్చుకోలేదన్నారు.

 ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అధికారంంలోకి రాకముందు మహిళా రిజర్వేషన్  బిల్లు విషయమై  హామీ ఇచ్చాడన్నారు. కానీ అధికారంలోకి వచ్చి  తొమ్మిదేళ్లు కావస్తున్నా  మహిళా రిజర్వేషన్ బిల్లును  పార్లమెంట్ లో  ఎందుకు  ప్రవేశపెట్టలేదో  చెప్పాలని  ఆయన  ప్రశ్నించారు.  మోడీకి  సంపూర్ణ మెజారిటీ కూడా ఉందన్నారు.  దేవేగౌడ,మన్మోహన్ సింగ్,  ఐకె గుజ్రాల్  ప్రభుత్వాలకు  సంపూర్ణ మెజారిటీ లేని విషయాన్ని  నారాయణ  ఈ సందర్భంగా  ప్రస్తావించారు. 

సంపూర్ణ మెజారిటీ లేని కారణంగా  తమ  మిత్రపక్షాలు  మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తే దేవేగౌడ,  గుజ్రాల్,  మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు  ఇబ్బందులు పడ్డాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును  మోడీ ఎందుకు  ప్రవేశ పెట్టడం లేదో చెప్పాలన్నారు. పార్లమెంట్ లో  మోడీ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెడితే లెఫ్ట్ , బీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తాయని  నారాయణ  ప్రకటించారు. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సుప్రీంలో చుక్కెదురు: స్టేకి నిరాకరణ

 రాజకీయంగా  బీజేపీతో  కమ్యూనిష్టులకు  వైరం ఉందన్నారు. కానీ మహిళా రిజర్వేషన్  బిల్లుపై  తాము  మద్దతిస్తామని  ఆయన స్పష్టం  చేశారు. కవిత, తాను తెలంగాణ ఉద్యమం నుండి  కలిసి పనిచేస్తున్నామన్నారు. తెలంగాణకు  మద్దతు ఇచ్చిన  జాతీయ పార్టీ సీపీఐ అని ఆయన చెప్పారు.  మహిళా రిజర్వేషన్ బిల్లు విషయమై  చట్టసభల్లోనూ, బయట తాము పోరాటం చేస్తున్నామని  నారాయణ  తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?