
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై పార్లమెంట్ లో బుధవారం సైట్లైర్లు వేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో చాలా సేపు ప్రసంగించారని అన్నారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తనకు ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఆయనకు మాట్లాడే అవకాశం ఎలా వచ్చిందనే దాని గురించి తాను ఆలోచించానని మోడీ అన్నారు.
మంచి పనులు చేసే వ్యక్తికి గౌరవం దక్కదు - నితిన్ గడ్కరీ
కొంత సమయం తరువాత సభలో ఇద్దరు స్పెషల్ కమాండర్లు లేరని తనకు అర్థమైందని అన్నారు. అందుకే ఆ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారని.. ఖర్గే 'ఐసా మౌకా ఫిర్ కహా మిలేగా' అనే పాట గుర్తు వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నాని ఎద్దేవా చేశారు..ఆ రోజు తాను చెప్పలేకపోయానని, అయితే ఖర్గేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఆ రోజు ఆయన చెప్పేది ఎంతో శ్రద్ధగా, ఆహ్లాదంగా విన్నానని, అందుకే లోక్ సభలో లేని వినోదం లోటును ఆయన తీర్చారని తెలిపారు.
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ఇంత పెద్ద పార్టీ (కాంగ్రెస్ ను ఉద్దేశించి) పతనాన్ని చవిచూసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీని పట్ల తాము సంతోషంగా లేమని అన్నారు. ఆ పార్టీ నాయకుల పట్ల సానుభూతి ఉందని తెలిపారు. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు దాటదని పశ్చిమబెంగాల్ (మమతా బెనర్జీ) నుంచి ఒక సవాల్ వచ్చిందని అన్నారు.
బీజేపీ పడక గదుల్లోకి కూడా వచ్చేసింది - ఉత్తరాఖండ్ యూసీసీపై ప్రతిపక్షాల కామెంట్స్..
‘‘గత కొన్నేళ్లుగా జరిగిన సంఘటన నాకు గుర్తుంది. మనం భవనంలో కూర్చుని దేశ ప్రధాని గొంతు నొక్కే ప్రయత్నాలు చేసేవాళ్లం... ఈ రోజు కూడా మీరు వినకుండా అదే పనికి సిద్ధంగా వచ్చారు. కానీ మీరు నా గొంతును అణచివేయలేరు. దేశ ప్రజలు ఈ గొంతును బలపరిచారు... ఈసారి నేను కూడా సిద్ధంగా ఉన్నాను’’ అని ప్రధాని మోడీ అన్నారు.