దేశంలో మళ్లీ కరోనా విజృంభన.. ఆ మూడు రాష్ట్రాల్లో మాస్క్‌లను తప్పనిసరి..

By Rajesh KarampooriFirst Published Apr 9, 2023, 3:28 PM IST
Highlights

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి. సన్నద్ధతను అంచనా వేయడానికి ఏప్రిల్ 10 మరియు 11 తేదీలలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే.. హర్యానా, కేరళ, పుదుచ్చేరిలలో మాస్క్ తప్పనిసరి చేశారు.  

దేశంలో మరోసారి కరోనా కేసులు ఊపందుకున్నాయి. రోజూ ఐదు నుంచి ఆరు వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్యలతోపాటు.. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ వారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి.. రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో సన్నద్ధతను అంచనా వేయడానికి ఏప్రిల్ 10 మరియు 11 తేదీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ఈ మూడు రాష్ట్రాల్లో మాస్క్‌లను తప్పనిసరి 

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా హర్యానా, కేరళ, పుదుచ్చేరిలలో మాస్కులు తప్పనిసరి చేశారు. హర్యానా ప్రభుత్వం ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి. కరోనా నివారణకు అవసరమైన నియమాలను పాటించాలని ప్రభుత్వం సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. జిల్లా, పంచాయతీ పాలకవర్గం పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.

అదే సమయంలో కేరళ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, వృద్ధులు , జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి మాస్క్‌లను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ అనంతరంలో  కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. కోవిడ్ సంబంధిత మరణాలలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు. లో ఆక్సిజన్ లభ్యత ఉండేలా చూడాలని ఆరోగ్య శాఖను ఆదేశించిన మంత్రి వీణా జార్జ్.. త్వరలో ప్రైవేట్ ఆసుపత్రుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

దీంతో పాటు పుదుచ్చేరి యంత్రాంగం కూడా కరోనా చర్యలను కఠినంగా పాటిస్తోంది. పుదుచ్చేరి అడ్మినిస్ట్రేషన్ వెంటనే అమలులోకి వచ్చేలా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ,వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఓ ప్రకటనలో తెలిపింది.

click me!