స‌రిహ‌ద్దులో ఉగ్ర‌వాదుల‌ చోరబాట్లు: ఒక‌రు హ‌తం.. కోన‌సాగుతున్న ఆప‌రేష‌న్

Published : Apr 09, 2023, 03:00 PM IST
స‌రిహ‌ద్దులో ఉగ్ర‌వాదుల‌ చోరబాట్లు: ఒక‌రు హ‌తం.. కోన‌సాగుతున్న ఆప‌రేష‌న్

సారాంశం

Jammu and Kashmir: జ‌మ్మూకాశ్మీర్ లోని పూంచ్ లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ చొరబాటుదారుడిని భ‌ద్ర‌తా బ‌గాలు కాల్చి చంపాయి. షాపూర్ సెక్టార్ లో అదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశామనీ, నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులు వారి కదలికలను గుర్తించి ఎదురుకాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.

Pakistani intruder shot dead in Jammu and Kashmir's Poonch: జ‌మ్మూకాశ్మీర్ లోని పూంచ్ లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ చొరబాటుదారుడిని భ‌ద్ర‌తా బ‌గాలు కాల్చి చంపాయి. షాపూర్ సెక్టార్ లో అదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశామనీ, నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులు వారి కదలికలను గుర్తించి ఎదురుకాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవ‌లి కాలంలో జమ్మూకాశ్మీర్ సరిహ‌ద్దులో ఉగ్ర‌వాదుల చోర‌బాట్లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో చొర‌బాటు య‌త్నాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అడ్డుకున్నాయి. పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ వోసీ) వెంబడి ఆదివారం తెల్లవారుజామున భారీ చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ దళాలు భగ్నం చేయడంతో పాక్ చొరబాటుదారుడు హతమైనట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

షాపూర్ సెక్టార్ లో తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశామనీ, నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులు వారి కదలికలను గుర్తించి ఎదురుకాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో పూంచ్ లోని నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు కంచెకు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల గుంపును సైనికులు గుర్తించారని జమ్మూకు చెందిన ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.

ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ లో ఒక మృతదేహం (కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో పడి ఉంది) మ‌రో ఇద్ద‌రు అటవీ ప్రాంతంలోకి పరిగెత్తడం కనిపించింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో మరో ఇద్దరు పాక్ చొరబాటుదారులు ఉన్నట్లు సైన్యం అనుమానిస్తోందని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?