భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్క రోజే 58 వేలకు పైగా కొత్త కేసులు.. 2 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

By Sumanth KanukulaFirst Published Jan 5, 2022, 10:21 AM IST
Highlights

భారత్‌లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. గత వారం రోజులుగా కేసుల్లో (covid cases in india) భారీ పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 58,097 Covid కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. గత వారం రోజులుగా కేసుల్లో (covid cases in india) భారీ పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 58,097 Covid కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. అయితే ఇవి క్రితం రోజుతో పోల్చితే 55 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనాతో మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,551కి చేరింది. నిన్న కరోనా నుంచి 15,389 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,004 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో రోజువారీ పాజివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. 

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.01 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.60 శాతంగా ఉందని తెలిపింది. ఇక, భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశవ్యాప్తంగా 96,43,238 వ్యాక్సిన్ డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు దేశంలో పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,47,72,08,846కి చేరింది. జనవరి 3 నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

అయితే కోవిడ్ మరణాల డేటాకు సంబంధించి.. 534 మంది మృతిచెందినట్టుగా కేంద్రం పేర్కొంది. అందులో కేరళ నుంచి మొత్తంగా 453 మరణాలను చూపించారు. కేరళలో జనవరి 4వ తేదీన కరోనాతో 30 మంది మృతిచెందగా.. గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న  423 కేసులను కూడా జోడించారు. గత సుప్రీంకోర్టు మార్గదర్శకాల తర్వాత పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల ఆధారంగా గణంకాలను యాడ్ చేశారు.

Also Read: Booster Doseగా భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా.. ఎస్ఈసీ పరిశీలన...

2,135కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారత్‌లో భారీగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 828 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653 నమోదయ్యాయి. ఆ తర్వాత 464 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఒమిక్రాన్ కేసులు విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 653, ఢిల్లీలో 464, కేరళలో 185, రాజస్తాన్‌లో 174, గుజరాత్‌లో 154, తమిళనాడులో 121, తెలంగాణలో 84, కర్ణాటకలో 77, హర్యానాలో 71, ఒడిశాలో 37, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 24, పశ్చిమ బెంగాల్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 8, గోవాలో 5, మేఘలయాలో 5, చంఢీఘర్ 3, జమ్మూకశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్‌లో 2, పంజాబ్‌లో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌ 1 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య వెల్లడించింది.  ఇక, దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలను ప్రకటించాయి.

click me!