
Covid-19 update india: దేశంలో గతకొంత కాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గతవారం ప్రారంభం నుంచి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా 20 వేలకు పైగా నమోదవుతున్న కరోనా కొత్త కేసులు.. నాలుగు రోజుల తర్వాత 20K-మార్క్ కంటే దిగువకు చేరాయి. అయితే, మరణాలు మాత్రం క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,935 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా వైరస్ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,67,534 కు చేరుకుంది.
గత 24 గంటల్లో కరోనావైరస్ తో పోరాడుతూ 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటిరవకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,25,760కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,44,264 ఉన్నాయి. ఇది మొత్తం కేసులలో 0.33 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో మొత్తం 16,069 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. కా
ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన ఒక సంవత్సరం తర్వాత - భారతదేశంలో ఆదివారం నాటికి రెండు బిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించే మైలురాయిని అధిగమించిందని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మీడియాతో మాట్లాడుతూన.. “కేవలం 18 నెలల్లో 200 కోట్ల టీకాల లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా భారతదేశం కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన దేశవాసులందరికీ హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు. నివేదికల ప్రకారం దేశ జనాభాలో కనీసం 90 శాతం మంది కోవిడ్-19కి పూర్తిగా టీకాలు వేశారు.
కాగా, దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానాలు ఉన్నాయి.