హోం క్వారంటైన్ లో నాటు సారా తయారీ.. కరోనా బాధితుడి నిర్వాకం..

By AN TeluguFirst Published Jun 16, 2021, 1:06 PM IST
Highlights

కరోనా సోకితే ఏం చేయాలి.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. తీవ్రత తక్కువగా ఉంటే ఇంట్లో లేదా ఆస్పత్రిలో చేరాలి. అయితే తమిళనాడులో ఓ కరోనా బాధితుడు అతి తెలివి ప్రదర్శించాడు. హోం క్వారంటైన్ లో ఉండి నాటు సారా తయారీ చేసి పోలీసులకు చిక్కాడు. 

తమిళనాడు లోని అడయార్, కోవై జిల్లాలో కరోనా వైరస్ సోకిన ఓ బాధితుడు హోం క్వారంటైన్ లో నాటు సారా తయారు చేశాడు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు ఇలా ఉన్నాయి.. 

కోవై జిల్లా ఆనాందురై వినాయకర్ ఆలయ వీధిలో ఓ ఇంట్లో నాటుసారా తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మఫ్టీలో వెళ్లి ఆ ఇంట్లో సోదాలు చేశారు. ఈ ఇంట్లో సారా తయారీకి అవసరమైన అన్ని వస్తువులను సమకూర్చుకున్న ఓ యువకుడు.. సారా తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. 

ఆ తరువాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా బారినపడిన ఈ యువకుడు హోం క్వారంటైన్ లో ఉంటూ సారా తయారీ చేస్తున్నట్లు తెలిసింది.

దీంతో షాక్ అయిన పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. అతని ఇంటినుంచి 1200 లీటర్ల స్పిరిట్, 210 కేజీల చక్కెర, గ్యాస్ స్టవ్, వంట గ్యాస్ సిలిండర్ తో పాటు సారా తయారీలో ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

click me!