ఢిల్లీలో దారుణం.. ఈ-రిక్షా మీదికి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

Published : Jun 16, 2021, 12:48 PM IST
ఢిల్లీలో దారుణం.. ఈ-రిక్షా మీదికి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

సారాంశం

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఈ-రిక్షా మీదికి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు ఈ-రిక్షా డ్రైవర్ కాగా, మరొకరు అందులో ప్రయాణిస్తున్న మహిళ. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ ఘటన ఢిల్లీ, దర్యాగంజ్ డెలైట్ సినిమా సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మహిళ తన ఇద్దరు పిల్లలతో ఇ-రిక్షాలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

ఈ సంఘటన తాలూకు సిసిటివి ఫుటేజ్ ప్రకారం.. కారు ఈ-రిక్షా మీదికి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు బ్రేకులు జామ్ కావడంతో కంట్రోల్ తప్పి రిక్షా మీదికి దూసుకెళ్లినట్టు కనిపించింది. ఆ తరువాత ఈ వీడియో జూమ్ చేసి కనిపించింది.

జామా మసీదులోని బర్ష్లా బుల్లా చౌక్ సమీపంలో జరిగిన పికెట్ వద్ద అడ్డగించిన కారును ఒక మోటార్ సైక్లిస్ట్ వెంబడించాడని పీటీఐకి ఒక పోలీసు అధికారి తెలిపాడు. 

సంఘటన జరిగిన సమయంలో  కారు డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నాడని, అతన్ని  అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, కారు నుంచి పలు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
 
PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu