మేనకోడలితో పెళ్లికి ఒప్పుకోలేదని.. తుపాకీతో బెదిరించి, గదిలో బంధించి...

Published : Jun 16, 2021, 11:43 AM IST
మేనకోడలితో పెళ్లికి ఒప్పుకోలేదని.. తుపాకీతో బెదిరించి, గదిలో బంధించి...

సారాంశం

ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టాడో వ్యక్తి. ఒడిశా, భువనేశ్వర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టాడో వ్యక్తి. ఒడిశా, భువనేశ్వర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

యువతితో తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించారనే కోపంతో ఓ యువకుడు అమ్మాయి కుటుంబానికి తుపాకీ చూపించి బెదిరించి వారిని ఇంట్లో బంధించిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బోలంగీర్ పట్టణంలో వెలుగు చూసింది. పాండా అనే యువకుడు ఆసుపత్రిలో పనిచేస్తున్న హౌటా అనే తన మేనకోడలితో ప్రేమలో ఉన్నాడు.

పాండాకు అమ్మాయినిచ్చేందుకు మహిళ కుటుంబం ఇష్టపడలేదు. దీంతో వారు ఒప్పుకోలేదు. అది పాండాకు కోపం తెప్పించింది. దీంతో దివ్యలోచన్  హూటా ఇంటికి వచ్చి భార్య, కుమారుడికి తుపాకీ చూపించి బెదిరించాడు. అంతేకాదు వారిని ఇంట్లో బందించాడు. 

విషయం తెలిసిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. కిటికీ గుండా కుటుంబసభ్యులను బైటికి తీసుకువచ్చారు. నిందితుడు పోలీసులమీద కూడా కాల్పులు జరిపాడు. ఆ తరువాత పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Tamil Nadu Assembly