కోవిడ్-19 : గడిచిన 24 గంటల్లో 7,533 కొత్త కరోనా కేసులు.. 44 మందిమృతి..

By SumaBala BukkaFirst Published Apr 28, 2023, 11:35 AM IST
Highlights

దేశంలో గత 24 గంటల్లో 7,533 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 44 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ ఉదృతి తగ్గడంలేదు.
 

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 7,533 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకున్న కోవిడ్ 19 కేసుల సంఖ్య 4.49 కోట్లకు పెరిగింది. అయితే క్రియాశీల కేసులు 53,852 కు తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

తాజాగా నమోదైన 44 మరణాలతో.. ఈ మరణాల సంఖ్య 5,31,468కి పెరిగింది. ఇందులో కేరళలో నమోదైన 16 మరణాలు కూడా చేర్చారని.. ఉదయం 8 గంటలకు మంత్రిత్వ శాఖ నవీకరించిన డేటాలో పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.12 శాతంగా ఉన్నాయని తెలిపింది.

Latest Videos

వాళ్లకు విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే.. సుప్రీంకోర్టు...

మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో షేర్ చేసిన డేటా ప్రకారం, జాతీయ COVID-19 రికవరీ రేటు 98.69 శాతంగా నమోదైంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,47,024కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.

మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా కోవిడ్-19 ఇనాక్యులేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో మొత్తం 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు.

click me!