పిల్లాడు ఎదురుగా హస్త ప్రయోగం..60ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష..!

By telugu news teamFirst Published Sep 2, 2022, 11:24 AM IST
Highlights

బాలల లైంగిక వేధింపుల కేసులో అతనిని దోషిగా నిర్దారిస్తూ.. అతనికి న్యాయస్థానం  ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది.  పోక్సో చట్టం కింద ఆయనకు ఈ శిక్ష వేసినట్లు న్యాయస్థానం పేర్కొంది.
 

హస్త ప్రయోగం చేసినందుకు ఓ 60ఏళ్ల వృద్ధుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.  హస్త ప్రయోగం నేరం కాదు కదా.. అతనికి ఎందుకు శిక్ష వేశారు అనే అనుమానం మీకు కలగవచ్చు. అయితేత... ఓ చిన్న పిల్లాడు ఎదురుగా అతను ఈ హస్త ప్రయోగం  చేయడం గమనార్హం. అలా చేయడం వల్ల.. బాలల లైంగిక వేధింపుల కేసులో అతనిని దోషిగా నిర్దారిస్తూ.. అతనికి న్యాయస్థానం  ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది.  పోక్సో చట్టం కింద ఆయనకు ఈ శిక్ష వేసినట్లు న్యాయస్థానం పేర్కొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిందితుడు ముంబయిలోని ఓ టైలరింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అక్కడకు పక్క ఇంట్లో ఉండే నాలుగేళ్ల బాలుడు వెళ్లాడు. ఆ సమయంలో అతను తన ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ కనిపించాడు. అంతేకాదు.. ఆ సమయంలో అతను బాలుడికి తన ప్రైవేట్ పార్ట్ ని కూడా చూపించాడట. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు  చేశారు.

అయితే.. నిందితుడి తరపు న్యాయవాది ఈ విషయంలో గట్టిగానే వాదించారు. సదరు వృద్ధుడు.. బాలుడిని పిలవలేదని.. తన దుకాణం దగ్గరకు రమ్మని కూడా అడగలేదని చెప్పాడు. అయితే.. అనుకోకుండా బాలుడు వచ్చాడట. అయితే.. బాలుడు వచ్చినప్పుడు అతను తన ప్రైవేట్ పార్ట్ ని దాచుకోకుండా.. బాలుడికి చూపించడం గమనార్హం. అలా చూపించడం కూడా లైంగిక వేధింపు కిందకే వస్తుంది అని కోర్టు అభిప్రాయపడింది. అందుకే అతనికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
 

click me!