కుండపోత వర్షం పడుతున్నా వెనుకడుగు వేయని పెళ్లి జంట.. వరద నీటిలోనే గొడుగులు పట్టుకుని ఆలయానికి.. (వీడియో)

Published : Nov 11, 2022, 10:48 PM IST
కుండపోత వర్షం పడుతున్నా వెనుకడుగు వేయని పెళ్లి జంట.. వరద నీటిలోనే గొడుగులు పట్టుకుని ఆలయానికి.. (వీడియో)

సారాంశం

తమిళనాడులో కుండపోత వర్షం కారణంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ, చెన్నైలోని పలింథోప్ ఏరియాలోని ఆంజినేయర్ టెంపుల్‌లో మాత్రం సీన్ విరుద్ధంగా ఉన్నది. ఆ ఆలయంలోనూ నీరు నిండిపోయినా.. వర్షం జోరుగా పడుతున్నా పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్లు గొడుగులు పట్టుకుని విచ్చేశారు. పెళ్లిళ్లు చేసుకున్నారు.  

చెన్నై: తమిళనాడులోని పలు చోట్ల కుండపోత వర్షం పడుతున్నది. ఫలితంగా చాలా పనులు వాయిదా పడుతున్నాయి. ముఖ్యమైన కార్యాలు కూడా మరో తేదీకి మారిపోతున్నాయి. శుక్రవారం మంచి రోజు కావడంతో చాలా పెళ్లిళ్లలకు ముహూర్తాలు ఉన్నాయి. కానీ, ఎడతెగని వర్షం పెళ్లి ముహూర్తాలను వాయిదా వేసుకునే పరిస్థితికి తెచ్చింది. కానీ, కొన్ని జంటలను మాత్రం ఈ వర్షం ఆపలేకపోయింది.

కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదు అనే నానుడికి ఈ జంటలు సాక్ష్యం. ఒక వైపు వర్షాలతో జనజీవనమే స్తంభించిపోయింది. రోడ్లూ నీట మునిగిపోయాయి. అడుగు తీసి అడుగు వేస్తే వరద నీరే. పెళ్లి చేసుకునే దేవాలయాల్లోనూ వరద నీరు వచ్చి చేరింది. అయినప్పటికీ నెలల ముందే ముహూర్తాలు ఖరారైన కొందరు తమ పెళ్లి వేడుకను మరో తేదీకి వాయిదా వేయాలని అనుకోలేదు. అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని భీష్మించుకున్నారు. అందుకే, రోడ్లను వరద మయం అయినప్పటికీ గొడుగులు చేతపట్టుకుని నూతన వధువు, వరులు వర్షంలోనే ఆలయానికి విచ్చేశారు. చెన్నైలోని పులింథోప్ ఏరియాలోని ఆంజినేయర్ ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది.

Also Read: ఆనంద్ సినిమా రిపీటయ్యింది... పెళ్లి లెహంగా నచ్చలేదని.. వివాహాన్ని రద్దు చేసుకున్న వధువు..

ఆంజినేయర్ ఆలయంలో ఐదు పెళ్లిళ్లు జరగాల్సి ఉన్నది. కానీ, ఎడతెరపి లేని కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ, పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్లు ఆలయానికి చేరి వివాహం చేసుకోవడానికి లైన్ కట్టారు. ఈ పెళ్లిళ్లు కొన్ని నెలల క్రితమే షెడ్యూల అయ్యాయి.

ఒక వైపు కుండపోత వర్షం పడుతున్నా.. పెళ్లికి వచ్చిన వారి ముఖాల్లో చిరుమందహాసం కనిపించడం గమనార్హం. వారు ప్రవేశించినా ఆలయంలోనూ వరద నీరు ఉన్నది. అయినా.. వివాహ వేడుక కళను మాత్రం వారు పోనివ్వలేదు. నవ్వులు, తుళ్లింపులు, సంబురాలతో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu