రేపే హిమాచల్​ ప్రదేశ్ పోలింగ్... ఏర్పాట్లు పూర్తి, బరిలో 400 మంది అభ్యర్ధులు

Siva Kodati |  
Published : Nov 11, 2022, 09:02 PM IST
రేపే హిమాచల్​ ప్రదేశ్ పోలింగ్... ఏర్పాట్లు పూర్తి, బరిలో 400 మంది అభ్యర్ధులు

సారాంశం

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 55.92 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు.  

హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఆ రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు. మొత్తం 400 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్నీ పరీక్షించుకోనున్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. 

ఇకపోతే... హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఎన్నికకు 48 గంటల ముందు నుంచి ప్రచారంపై నిషేధం అమల్లోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ గట్టిగానే క్యాంపెయిన్‌లు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. కాగా, అధికార పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలిపెట్టారని, అవే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తున్నది. బీజేపీ వైపు పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రంలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రాష్ట్రంలో క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ ఈ రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఇదిలావుండగా పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తేనే హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని మోడీ పేర్కొన్నారు. 

ALso Read:హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు రూ.545 కోట్ల విరాళాలు

మరోవైపు... హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12వ తేదీన.. గుజరాత్‌లో డిసెంబర్ 1, 8 తేదీల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951లోని సెక్షన్ 126ఏలోని సబ్ సెక్షన్ (ఎల్) కింద సక్రమించిన అధికారులను వినియోగించుకుంటూ ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu