వయోజన యువతులు సహజీవనం చేయవచ్చు.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

By Rajesh KarampooriFirst Published Nov 11, 2022, 8:31 PM IST
Highlights

ఇద్దరు వయోజన యువతులు తమ ఇష్టానుసారం కలిసి జీవించే హక్కు ఉందనీ,వారిని కోర్టు కూడా అడ్డుకోలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. 22 ఏళ్ల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయిన 18 ఏళ్ల బాలిక తండ్రి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది. 

వయోజన యువతులు తమ ఇష్టానుసారంగా కలిసి జీవించాలని భావిస్తే వారి కోరికను గౌరవించాలని,వారిని కోర్టు కూడా అడ్డుకోలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. 22 ఏళ్ల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయిన 18 ఏళ్ల బాలిక తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను  మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. వారిద్దరూ వయోజనులు కావడంతో.. వారు తన జీవితంలో స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుందని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

బల్‌పూర్ నివాసి (18 ఏళ్ల బాలిక తండ్రి) దాఖాలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ ను  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి మళీమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మసనం పై వ్యాఖ్యలు చేసింది. 22 ఏళ్ల యువతి తన 18 ఏళ్ల కుమార్తెను మోసగించి జబల్‌పూర్ నుండి భోపాల్‌కు తీసుకెళ్లినట్లు ఓ తండ్రి ఆరోపించాడు. తన కుమార్తెను ఆ యువతి బలవంతంగా బందీగా చేసిందనీ, తన కూతురుని
ఆ యువతిని విడిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. 

సదరు యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 18 ఏళ్ల బాలికను కోర్టులో హాజరుపరచాలని జబల్‌పూర్‌లోని ఖమారియా పోలీస్ స్టేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు బాలికను భోపాల్‌లోని హాస్టల్‌ నుంచి జబల్‌పూర్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల యువతిని కూడా కోర్టు విచారించింది. ఈ సమయంలో కోర్టు స్నేహితులిద్దరికీ ఒక గంట సమయం ఇచ్చి తమలో తాము చర్చించుకోవాలని కోరింది. గంట తర్వాత వారిద్దరూ మళ్లీ కోర్టుకు హాజరయ్యారు.

ఇరువురు వాదనలు విన్న కోర్టు.. 18 ఏళ్ల అమ్మాయి తనకు నచ్చిన వారితో సహవాసం చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. వయోజనులు తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉందని, స్నేహితులిద్దరూ కలిసి జీవించాలనే కోరికను గౌరవిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేసింది.

అంతకుముందు..

తన 18 ఏళ్ల కుమార్తెను తన 22 ఏళ్ల స్నేహితురాలు బలవంతంగా తీసుకెళ్లిందని ఓ తండ్రి ఖమారియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరి కోసం అన్వేషణ ప్రారంభించారు. 22 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత.. తన కూతురుని మోసం చేసి.. బంధీగా చేసిందని సదరు తండ్రి ఆరోపించాడు. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. ఆమె నిరసన తెలపడంతో 18 యువతి ఇంటి నుంచి పారిపోయింది. ఈ వ్యవహారం హైకోర్టు మెట్లెక్కింది. 
 

click me!