రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసు.. లాలూ, ఆయన కుటుంబ సభ్యులపై మళ్లీ దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ

By team teluguFirst Published Dec 26, 2022, 1:02 PM IST
Highlights

లాలూ ప్రసాద్ యాదవ్ పై గతంలో సీబీఐ నమోదు చేసిన రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసును తాజాగా మళ్లీ రీ ఓపెన్ అయ్యింది. ఈ కేసుపై దర్యాప్తు 2021లోనే ముగిసింది. కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు పేరు కూడా చేరుస్తూ కేసు విచారణను ప్రారంభించింది. 

రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. యూపీఏ -1 ప్రభుత్వంలో లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి ఆరోపణలు రావడంతో 2018 లో ఈ విషయంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.

పెద్దకర్మ రోజు మిగిలిన ఆహారం తిని... 40 మందికి అస్వస్థత...

ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సీబీఐ వర్గాలు చెప్పడంతో మే 2021లో దర్యాప్తు ముగిసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ కేసును సీబీఐ ఓపెన్ చేసింది. అయితే ఈ కేసులో లాలూతో పాటు ఈ సారి ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ లను సీబీఐ నిందితులుగా చేర్చింది. 

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు.. ర‌థ‌యాత్ర చేప‌ట్ట‌నున్న బీజేపీ

ముంబైలోని బాంద్రాలో రైల్వే ల్యాండ్ లీజ్ ప్రాజెక్టులు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు ఆసక్తి ఉన్న డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి లాలూ యాదవ్ దక్షిణ ఢిల్లీలోని ఆస్తిని లంచంగా తీసుకున్నారని సీబీఐ కేసు పేర్కొంది. కాగా.. బీహార్ లో కొంత కాలం కిందట రాజకీయ పరిణామాలు మొత్తం వేగంగా మారిపోయాయి. బీహార్ లో నితీష్ కుమార్ జేడీ(యూ),బీజేపీలు ఎన్డీఏ కుటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రెండు పార్టీలకు మధ్య విభేదాలు ఏర్పడటంతో నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు.

వ్యక్తిని అడవిలోకి ఈడ్చుకెళ్లి.. సగం తిని వదిలేసిన పులి.. అది చూసిన స్నేహితులు పరుగులు..

రోజుల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ సీఎంగా, లాలూ కుమారుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ కేసు మళ్లీ రీ ఓపెన్ చేయడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.

భార్యపై అత్యాచారం.. భర్తకు నగ్న చిత్రాలు పంపి బెదిరింపులు.. అవమానంతో ఆత్మహత్య...

కాగా.. ఈ ఏడాది ఆగస్టులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబసభ్యులు, ఆర్‌జేడీకి సంబంధించిన వ్యక్తుల స్థలాలన్నింటిపై సీబీఐ దాడులు చేసింది. బీహార్, ఢిల్లీ, హర్యానాలోని 25 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 120బీ కింద సీబీఐ 2022 మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇందులో లాలూ ప్ర‌సాద్ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లతో సహా 12 మందిపై కూడా లాలూ కుటుంబానికి భూములిచ్చి ఉద్యోగాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

click me!